Begin typing your search above and press return to search.
స్టాక్ బ్రోకర్.. కేంద్రమంత్రి ఎలా అయ్యాడు?
By: Tupaki Desk | 31 May 2019 5:48 AM GMTదేశంలో సాధారణ స్టాక్ బ్రోకర్ దేశాన్ని ఏలే అత్యున్నత వ్యక్తుల్లో రెండో వాడిగా నిలవడం ఎప్పుడైనా చూశారా.? నక్కతోకను తొక్కడం అంటే ఇదేమరి.. ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో చివరి నిమిషంలో బెర్తు ఖాయం చేసుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గతంలో ఏం చేశారో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.
బీజేపీ ఇదివరకు అధికారంలోకి తీసుకొచ్చి వాజ్ పేయి-అద్వానీల జోడీని మరిపిస్తూ బీజేపీని 2014-2019లలో మోడీషాల జోడీ కూడా అధికారంలోకి తీసుకొచ్చింది. అమిత్ షా వ్యూహాలు - మోడీ ప్రచార సరళి బీజేపీ రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.
నిజానికి అమిత్ షా ఒకప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1989 నుంచి ఇప్పటివరకు అమిత్ షా 29 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో స్థానిక సంస్థల నుంచి తన ప్రస్థానం మొదలు పెట్టారు. అయితే ఆయన ఒక్క ఎన్నికల్లోనూ ఓడిపోకపోవడం విశేషం.
మొదటిసారి గుజరాత్ లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి 1997లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ తర్వాత వరుసగా 1998 - 2002 - 2007లో మొత్తం నాలుగుసార్లు గుజరాత్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రమంతిగా మోడీ సీఎం పేషీలో 12 మంత్రి పదవులు, శాఖలను నిర్వహించారు. హోంశాఖ - లా అండ్ జస్టిస్ - భద్రత - పౌరరక్షణ - ఎక్సైజ్ - రవాణా - ప్రొహిబిషన్ - హోంగార్డు - గ్రామ రక్షక దల్ - పోలీస్ హౌసింగ్ - లెజిస్లేటివ్ - పార్లమెంటరీ అఫెయిర్స్ వంటి కీలక శాఖలు నిర్వహించారు.
మంచి వ్యూహకర్తగా పేరున్న అమిత్ షాను మోడీ గుజరాత్ ఎన్నికల్లో బాగా ఉపయోగించుకున్నారు. అందుకే మోడీ గెలవగానే అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేశారు. అనంతరం ఆయన తన వ్యూహాలతో 2016నుంచి చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తన ప్రతాపం చూపి గెలిపించారు. ఇలా ఒక సాధారణ స్టార్ మార్కెట్ హోల్డర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగకుండా దేశాన్ని ఏలే స్థాయి వరకు చేరుకున్నారు.