Begin typing your search above and press return to search.
గోవాకి వచ్చేస్తున్నా అంటూ సీఎం తాజా వీడియో!
By: Tupaki Desk | 14 May 2018 5:07 AM GMTఅప్పటివరకూ అంతా బాగున్నట్లే ఉండటం.. అంతలోనే భారీ అనారోగ్యం మీద పడటం ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్నాయి. సామాన్యులే కాదు.. ప్రముఖులు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న పరిస్థితి. చూసేందుకు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్నట్లు కనిపించి.. ఉత్సాహంగా ఉండే గోవా ముఖ్యమంత్రి.. మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ తీవ్ర అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే.
క్లోమ గ్రంథికి సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన గడిచిన రెండు నెలలుగా అమెరికాలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా ఒక వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు.. అభిమానులకు పంపారు. నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. సీఎంగా ఉన్నప్పటికి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ దేశ ప్రజల అభిమానాన్ని పొందిన పారీకర్ కు అరుదైన వ్యాధి సోకటం షాకింగ్ గా మారింది.
ఆయన ఆరోగ్యం కుదుటపడాలని.. క్షేమంగా తిరిగిరావాలంటూ పెద్ద ఎత్తున కోరుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన పంపిన వీడియోలో తాను గోవాకు మరికొన్ని వారాల్లో తిరిగి రానున్నట్లు చెప్పటమే కాదు.. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఈ వీడియో సందేశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ వర్గాలకు స్వయంగా వినిపించటం గమనార్హం. గోవాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ఈ వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు ప్రదర్శించారు.
పారీకర్ తో తాను మాట్లాడానని.. ఆయన తన అనారోగ్యం గురించి పట్టించుకోకుండా కర్ణాటక ఫలితం గురించి వాకబు చేసినట్లుగా చెప్పారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని అమిత్ షా కొనియాడారు. పార్టీ పట్ల అంతులేని కమిట్ మెంట్ ఉన్న నేతగా పారీకర్ ను అభివర్ణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పారీకర్ వీడియో సందేశాన్ని ప్రదర్శించటానికి కాస్త ముందు.. గోవాలో పాలనపై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గడిచిన రెండు నెలల్లో గోవా తల లేని మొండెంలా మారిందని.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఇవ్వాలని.. లేదంటే ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేత యతీశ్‌నాయక్ డిమాండ్ చేశారు. పారీకర్ పరోక్షంలో రాష్ట్ర మంత్రులు ఎంజీపీకి చెందిన సుదీన్ ధవాలికర్.. బీజేపీకి చెందిన మరో మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా.. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన మంత్రి విజయ్ సర్దేశాయ్ లు రోజువారీ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఎంటరై పరిస్థితిని చక్కదిద్దే పనిలో భాగంగా ఈ వీడియోను బయటకు తీసినట్లుగా భావిస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి