Begin typing your search above and press return to search.

ల‌క్ష కోట్లకు లెక్క చెప్పిన అమిత్ షా

By:  Tupaki Desk   |   25 May 2017 4:28 AM GMT
ల‌క్ష కోట్లకు లెక్క చెప్పిన అమిత్ షా
X
తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెబుతున్న రూ.ల‌క్ష కోట్ల నిధుల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే. అయితే.. కేసీఆర్ మాట‌ల్ని ఏ మాత్రం ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన అమిత్ షా.. తెలంగాణ‌కు కేంద్రం రూ.ల‌క్ష కోట్లు ఇచ్చిన‌ట్లుగా మ‌రోసారి చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ‌పై తాను అబ‌ద్ధాలు చెబుతున్నాన‌న్న కేసీఆర్ మాట‌ల్ని తీసిపారేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన అమిత్ షా.. తాను చెబుతున్న ల‌క్ష కోట్ల రూపాయిల లెక్క‌ల్ని ప్ర‌జ‌ల కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణ‌కు గ‌డిచిన మూడేళ్ల‌లో రూ.96,406 కోట్ల నిధులు ఇచ్చిన‌ట్లుగా లెక్క చెప్పారు. వివిధ ప‌థ‌కాల అమ‌లుకు రూ.12 వేల కోట్లు తెలంగాణ‌కు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు.

తెలంగాణ‌లో ఎయిమ్స్‌.. అగ్రిక‌ల్చ‌ర్‌.. హార్టీ క‌ల్చ‌ర్.. వెట‌ర్న‌రీ వ‌ర్సిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. 70 ఏళ్ల‌లో సాధ్యం కానిది మూడేళ్ల‌లో చేసి చూపించిన‌ట్లుగా పేర్కొన్నారు. 28 కోట్ల జ‌న్ ధ‌న్ అకౌంట్ల‌ను తెరిపించామ‌ని.. 7.5 కోట్ల మందికి ఉపాధి క‌ల్పించామ‌ని వెల్ల‌డించారు. మోడీ నేతృత్వంలో స‌ర్కారు అభివృద్ధి ర‌థం దౌడు తీస్తుంద‌న్నారు.

దేశం మొత్త‌మ్మీదా 13 రాష్ట్రాల్లో బీజేపీ ప‌వ‌ర్ లో ఉంద‌ని.. త‌మ పార్టీకి మొత్తం 1327 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌న్న అమిత్ షా.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీగా త‌మ‌ది చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. తెలంగాణ‌కు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్న రూ.ల‌క్ష కోట్ల లెక్క‌ విష‌యంలోనే అమిత్ షా మ‌రింత క్లారిటీగా వివ‌రాలు ఇస్తే బాగుండేద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/