Begin typing your search above and press return to search.
మోడీ.. షాలు భేటీ అయిన ప్రతిసారీ.. ఆ టాపిక్ చర్చకు వస్తుందట!
By: Tupaki Desk | 27 Dec 2020 5:15 AM GMTదేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తులు ఎవరంటే.. ప్రధాని మోడీ..ఆయనకు కళ్లు.. చెవులుగా చెప్పే కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని మోడీకి నీడలా అమిత్ షాను అందరూ అభివర్ణిస్తుంటారు. ప్రతి విషయాన్ని వారిద్దరూ కలిసి డిసైడ్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ గురించి ఒక కొత్త విషయాల్ని వెల్లడించారు అమిత్ షా.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. జమ్ముకశ్మీర్ కు మోడీ ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. తామిద్దరం భేటీ అయిన ప్రతిసారీ.. కశ్మీర్ కు ఏమేం చేయాలన్న విషయాల గురించి మోడీ ప్రతిసారీ చెబుతుంటారని అమిత్ షా చెప్పారు.
‘నేను మోడీని కలిసి ప్రతి సందర్భంలోనూ.. జమ్ముకశ్మీర్ లో చేయాల్సిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడుతుంటారు. అక్కడి ప్రజల బాగోగులు.. శాంతిభద్రతల గురించి కచ్ఛితంగా ప్రస్తావనకు వస్తుంది. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదు. జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్ముకశ్మీర్ లో ప్రతిరంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది’ అని అమిత్ షా చెప్పారు.
మోడీ ఆరేళ్ల పాలనలో జమ్ముకశ్మీర్ చరిత్రలో అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని షా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా నిలుస్తుందన్న ఆయన.. ఆ రాష్ట్ర ప్రజలతో మోడీకి ప్రత్యేక అనుబంధం.. ప్రేమ ఉన్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా జరిగిన వైనం దేశానికి గర్వకారణమన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొనటం మోడీకి సంతోషాన్ని ఇచ్చినట్లుగా చెప్పారు.