Begin typing your search above and press return to search.
బీజేపీ గెలుపు ఫార్ములాను బయటపెట్టిన షా!
By: Tupaki Desk | 11 Oct 2018 4:56 AM GMTఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధికారపార్టీగా అవతరించటం సాధ్యమా? అన్న ప్రశ్న వేస్తే.. నో..సాధ్యమే కాదని చెబుతారు. కానీ.. అదేమీ అసాధ్యం కాదు.. సాధ్యమేనన్న విషయాన్ని అర్థమయ్యేలా చేతల్లో చేసి చూపించిన సత్తా బీజేపీ సొంతం.
ఆ పార్టీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేని పలు ఈశాన్యరాష్ట్రాల్లో ఇప్పుడు పవర్లో ఉన్న పరిస్థితి. అదెలా సాధ్యమవుతుంది? ఎలా గెలుస్తారు? అధికారంలోకి రావటానికి బీజేపీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? అన్న ప్రశ్నకు సూటి సమాధానం వినిపించదు. తాజాగా ఆ లోటును తీరుస్తూ.. బీజేపీ సక్సెస్ ఫార్ములాను పార్టీ నేతల ఎదుట బయటపెట్టారు అమిత్ షా. తాజాగా కరీంనగర్ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు ఇచ్చిన ఆయన.. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ శక్తి కేంద్రాలు.. బూత్ కేంద్రాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలకాంశాన్ని షా బయటపెట్టారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావటానికి కారణం ఆయా రాష్ట్రాల్లో పార్టీ శక్తి కేంద్రాలు.. బూత్ కేంద్రాల సమర్థతోనే సాధ్యమైందని చెప్పారు. శక్తి కేంద్రాల అధ్యక్షులు తమకు కేటాయించిన బూత్ లలో 15 రోజుల పాటు వెళ్లి.. పార్టీ సూచించిన 23 మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తే.. తెలంగాణలో గెలుపు తథ్యమని చెప్పటం గమనార్హం.
దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మనకు 15 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. పంజాబ్.. ఒడిసా.. ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కేరళలో పాగా వేస్తే పార్టీ సంపూర్ణ విజయం సాధించినట్లు అన్న విషయాన్ని చెప్పి షా.. తెలంగాణలో బీజేపీ విజయం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో గెలుపు అసాధ్యమేమీ కాదని.. సాధ్యమేనని.. ఇందుకు తమకు చాలానే అనుభవాలు ఉన్నట్లు షా చెప్పారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేని మణిపూర్.. త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ పవర్లోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కాకుంటే.. శక్తి కేంద్రాల బాధ్యులు తాము చెప్పినట్లు తూచా తప్పకుండా పని చేస్తే.. గెలుపు మనదేనన్న ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ అన్నేసి రాష్ట్రాల్లో పవర్లోకి ఎలా వచ్చిందో ఇప్పడు అర్థమైందా?