Begin typing your search above and press return to search.

బాబును ఓ కంట క‌నిపెడుతున్న అమిత్ షా

By:  Tupaki Desk   |   24 May 2019 7:00 AM GMT
బాబును ఓ కంట క‌నిపెడుతున్న అమిత్ షా
X
ఢిల్లీలో చ‌క్రం తిప్పేస్తా...బీజేపీని గ‌ద్దె దించేస్తా అని క‌ల‌లు కన్న తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు గురించి ఢిల్లీ ఏమ‌నుకుంటోంది? అస‌లు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆయ‌న్ను ఏ విధంగా చూస్తోంది? అనే సందేహంతో కూడిన ఆస‌క్తి ఎవ‌రికైనా తెర‌మీద‌కు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే, ఈ సందేహానికి బీజేపీ చీఫ్ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత ఫలితాలను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భారత విజయంగా అభివర్ణించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. కులతత్వం - బుజ్జగింపులు - వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో క‌లిసి అమిత్ షా మాట్లాడారు. ముందుగా అమిత్ షా మాట్లాడుతూ - ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు విపక్షాలను ఏకం చేయడానికి చాలా కృషి చేసారని - ఈ కష్టం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం చేసివుంటే ఇంత కష్టం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.చంద్రబాబు వి తుక్ డే తుక్ డే రాజకీయాలని అన్నారు. ఆంధ్రాలో గెలిచిన జగన్ మోహాన్ రెడ్డీకి మనస్పూర్తిగా అభినంధనలు తెలుపుతున్నట్లు బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారు.

ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, ``మండుటెండల్లో కూడా తరలివచ్చి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. నన్ను మరోసారి ఆశీర్వదించి - అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారత్ ఒక ప్రజాస్వామ్య శక్తి అని ప్రపంచదేశాలు గుర్తించాలి. పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకున్న ఈసీ - భద్రతా బలగాలు - ప్రజలకు అభినందనలు. 130 కోట్ల మంది ప్రజలు దేశం పక్షాన నిలిచారు. దేశం బాగు కోసమే వెల్లువలా తరలివచ్చి బీజేపీ ఓటేశారు. ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల జరిగినా..ఇంతటి ఘనవిజయం దక్కలేదు`` అని మోదీ అన్నారు.