Begin typing your search above and press return to search.

అమిత్ షా సంచలనం.. బాబుకు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   5 April 2019 5:30 AM GMT
అమిత్ షా సంచలనం.. బాబుకు నో ఎంట్రీ
X
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. బాబుకు ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసేశాం అని ప్రకటించి సంచలనం సృష్టించారు. నర్సారావుపేట బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద అవకాశవాది అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. చంద్రబాబు లాంటి స్వార్థపరుడు దేశంలో ఎక్కడా లేడని విమర్శించారు. చంద్రబాబు తీరుపై అమిత్ షా నిప్పులు కురిపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారని అమిత్ షా విమర్శించారు.

2014లో మోడీ హవా చూసే చంద్రబాబు ఎన్డీఏలో చేరారని.. 2019 ఎన్నికల సమయంలో ఓటర్ల సానుభూతి కోసం ఎన్టీఏ నుంచి బయటకు వచ్చేశామని ఆరోపించారు.తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా దూరంగా జరిగారన్నారు. నమ్మినవారిని మోసం చేయడమే బాబు నైజం అంటూ మండిపడ్డారు.

ఏపీ విభజన చట్టంలోని 14 హామీల్లో 11 హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.7వేల కోట్లు ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. బీజేపీని గెలిపిస్తే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మోడీ గెలిస్తే మళ్లీ ఎన్డీఏలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని.. కానీ చంద్రబాబుకి ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసివేశామని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీలకు బుద్ది చెప్పాలని షా కోరారు. టీడీపీతో స్నేహ సంబంధాలు ఇక ముందు కూడా ఉండబోవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభాముఖంగా తేల్చిచెప్పారు.