Begin typing your search above and press return to search.
ముస్లింలు.. పౌరసత్వ బిల్లు పై అమిత్ షా సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 11 Dec 2019 10:09 AM GMTలోక్ సభ లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు ను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు విషయంలో భారత్ లోని ముస్లింలు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇతర దేశాల ముస్లింలకు పౌరసత్వం కల్పించలేమని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో మైనారిటీల జనాభా 20శాతం మేర తగ్గిందని అమిత్ షా గుర్తు చేశారు. వారు అంతా ఆశ్రయం కోసం భారత్ కు వచ్చి ఉంటారని తెలిపారు.
ఈ బిల్లు చట్ట వ్యతిరేకం కాదని.. బిల్లుతో శరణార్థుల హక్కులు కాపాడుతామన్నారు. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. చారిత్రాక బిల్లుగా అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలోనే ఈ బిల్లు ఉందన్నారు.
ఇక పౌరసత్వ బిల్లు పై ఆందోళన చేస్తున్న అసోం ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులను మోడీ సర్కార్ కాపాడుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. గిరిజనులకు ఈ బిల్లు వర్తించదని తెలిపారు. ఈ చట్టాన్ని మిజోరంలో అమలు చేయమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోని ముస్లింలకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలా అని మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.
రాజ్యసభ లో చర్చ సందర్భంగా పలువురు నేతలు ఈ బిల్లు పై మాట్లాడారు. జైలు నుంచి విడుదలైన చిదంబరం రాజ్యసభకు హాజరై మాట్లాడుతూ ఈ రోజు దుర్ధినమని.. రాజ్యాంగ వ్యతిరేక బిల్లును ప్రభుత్వం పట్టుబట్టడం దారుణమని విమర్శించారు.
ఇక కర్ణాటకలో దేవెగౌడ పార్టీ జేడీఎస్ ఈ పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపింది.
ప్రస్తుతం మోడీషాల పాలన చూస్తే సర్ధార్ పటేల్, గాంధీలు గనుక తిరిగి వస్తే వీరిద్దరిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించేవారు అంటూ కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.