Begin typing your search above and press return to search.
వెంకయ్యనాయుడుకు అమిత్`షాక్'
By: Tupaki Desk | 1 April 2016 10:00 AM GMTతెలుగు రాష్ట్రాల్లో కమల దళపతుల నియామకంపై సీరియస్ గా చర్చ జరుగుతోంది. ఏపిలో పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన నియామకంపై పార్టీ జాతీయ అధినేత అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. వీర్రాజుకు పదవి రాకుండా వెంకయ్యనాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని టాక్.
మరోవైపు తనను తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చేసిన వినతులను అమిత్ షా పట్టించుకోలేదట. ఆయన కోసం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రయత్నాలూ వర్కవుట్ కాలేదు. పార్టీలో వెంకయ్య వర్గానికి చెక్ పెట్టేందుకే కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజుకు పగ్గాలు ఇస్తున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. ఏపిలో వెంకయ్య పెత్తనం - జోక్యం ఉన్నంతకాలం బిజెపి ఎదగడం కష్టమని ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడు ఉన్నతి కోరుకుంటారే తప్ప రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకోరన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో బాహాటంగానే వినిపిస్తుంటాయి. పార్టీ భవిష్యత్తు అవసరాల కోసం రాష్ట్రంలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నాయకత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందించడం దాదాపు ఖరారయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తెలంగాణలో ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసిపోయింది. కిషన్ రెడ్డి మరోసారి అధ్యక్ష పదవి తీసుకునేందుకు సుముఖంగా లేరు. జాతీయ పార్టీలో ఆయనకు మంచి బాధ్యతలే ఇస్తారని తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడిగా బిసి వర్గానికి చెందిన సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ ఓసీ వర్గానికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. లక్ష్మీనారాయణకు సంఘ్ దన్ను ఉండగా రామచంద్రరావుకు బిజెపి పార్టీతో పాటు ఏబివిపి అండ ఉంది. ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిలో చాలామంది గతంలో ఏబీవీపీలో పనిచేసిన వారే ఉన్నందున అది గతంలో ఏబీవీపీ నేతగా పనిచేసిన రామచంద్రరావుకు కలసిరానుంది.