Begin typing your search above and press return to search.
మోడీ అయిపోయారు ఇప్పుడు అమిత్ షాతో మొదలు పెట్టేశారు
By: Tupaki Desk | 17 Jan 2023 4:25 AM GMTఅవునా? కాదా? అన్నది పక్కన పెడితే.. మనసుకు తోచిన విషయాల్ని వార్తలుగా తీసుకొచ్చే కొత్త సంప్రదాయం ఈ మధ్యన ఎక్కువైంది. సోషల్ మీడియా.. వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యే ఎన్నో కథలకు తీసిపోని రీతిలో ప్రధాన మీడియా సంస్థలు కొన్ని సందర్భాల్లో రాజకీయకథనాల పేరుతో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కాకుంటే.. ఈ తరహా కథనాలకు ఉండే ప్రత్యేకత ఏమంటే.. విన్నంతనే నమ్మేసేలా ఉండటం. అంత బాగా మసాలా కలిపిన తర్వాత ఎవరు మాత్రం నమ్మకుండా ఉంటారు చెప్పండి.
తెలంగాణ మీద మోడీషాలు కన్నేయటం.. దానికిఅమిత ప్రాధాన్యత ఇవ్వటం.. తెలంగాణలో బీజేపీ బలాన్ని పెంచి.. కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాకివ్వాలన్న నిర్ణయాన్ని ప్రాథమికంగా తీసుకోవటమే కాదు.. అందులో భాగంగా ఇప్పటికే బోలెడంత కసరత్తు జరిగింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఏదోలా తమ సత్తా చాటాలని మోడీషాలు కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో జరుగుతున్న బీజేపీ కోర్ గ్రూప్ సమావేశాల్లోనూ తెలంగాణ టాపిక్ తరచూ రావటమే కాదు.. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇదే అదనుగా చేసుకొని కొన్ని కథనాలు ప్రధాన మీడియాలో వస్తున్నాయి. అదేమంటే.. తెలంగాణ ఎన్నికల బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగేందుకు ఆలోచిస్తున్నారంటూ ఈ మధ్యన కథనాలు వస్తున్నాయి. అదెలా అంటే.. మోడీ లాంటి పెద్ద మనిషి తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్రానికి తామిస్తున్న ప్రయారిటీ ఎంతన్న విషయం అర్థమవుతుందన్న వాదనను వినిపిస్తున్నారు. దీనిపై బీజేపీకి చెందిన ఏ ముఖ్యనేత కూడా ప్రస్తావించకుండానే ఇలాంటి వార్తా కథనాలు వచ్చేస్తున్నాయి.
ఇది సరిపోనట్లుగా తాజాగా అమిత్ షా కూడా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాలని.. పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా మరో వార్త వచ్చేసింది. తెలంగాణలో అధికారంతో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యధిక ఎంపీ సీట్లను తమ సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఈ తీరులో పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ తరహా ప్రచారంతో మరింత ఊపు తేవటంతో పాటు.. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎంత ప్రయారిటీ ఇస్తుందన్న విషయాన్ని ప్రజల్లో చర్చగా మార్చాలన్నదే లక్ష్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొన్నటివరకు సాగిన మోడీ ప్రచారం ఒక కొలిక్కి రాకముందే.. ఇప్పుడు అమిత్ షా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందని.. అది కూడా పాలమూరు బరిలో ఉంటుందంటూ సాగుతున్న చర్చ చూస్తుంటే.. అదిరే స్క్రిప్టుకు కేరాఫ్ అడ్రస్ గా ప్రధాన మీడియా సంస్థలు మారుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఈ అంచనాల్లో నిజం ఎంతన్న విషయాన్ని కాలం మాత్రమే సరైన రీతిలో సమాధానం చెప్పగలదన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.