Begin typing your search above and press return to search.
అమిత్ షా మరో వివాదంలో చిక్కుకున్నారే!
By: Tupaki Desk | 14 Aug 2017 12:14 PM GMTఅమిత్ షా... నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై దేశ రాజకీయాలనే చక్రం తిప్పుతున్న నేతగా ఇప్పుడు బాగానే పాపులర్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన బీజేపీ వ్యవహారాలతో మాత్రమే సరిపెట్టడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పాటు కొన్ని జాతీయ పార్టీల్లోనూ ఆయన చెప్పిందే వేదంగా జరుగుతున్న వైనం ఇప్పుడు మనందరికీ తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రమైన గుజరాత్ కు చెందిన షా... దక్షిణాది రాష్ట్రాలను చాలా చులకనగా చూస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనమే నిన్న కర్ణాటక పర్యటనలో భాగంగా ఆయన వ్వవహరించిన తీరు అన్న వాదన వినిపిస్తోంది.
కర్ణాకటలో షా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆయా పార్టీల నేతలతో పాటు దక్షిణాది ప్రజలు - ప్రత్యేకించి నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క ఘటనను ఫొటోలతో సహా ప్రస్తావిస్తున్న నెటిజన్లు... సోషల్ మీడియాలో ఆయన వైఖరిని ఏకిపారేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... కర్ణాటక పర్యటనలో భాగంగా నిన్న అమిత్ షా ప్రసిద్ది చెందిన ఆదిచుంచనగిరి మఠంకు చెందిన మఠాధిపతి శ్రీ నిర్మాలానందనాథను కలిశారు. శ్రీ నిర్మాలానందనాథను కలిసిన సమయంలో అమిత్ షా ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో, నేరుగా తీవ్రస్థాయిలో విమర్శలు మొదలైనాయి. ఒక్కలిగ కులస్థులు (గౌడ) దైవంతో సమానంగా భావించి శ్రీ నిర్మాలానందనాథను కలిసిన సమయంలో బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాలు మీద కాలు వేసుకుని మాట్లాడారని, దక్షిణ భారతీయులు - మఠాధిపతికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
*శ్రీ నిర్మాలానందనాథ కుర్చున్న కుర్చీ పక్కనే దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి. శ్రీ నిర్మాలానందనాథ - దేవుడి ఫోటోల వైపు కాలు చూపిస్తూ దర్జాగా కుర్చుని మాట్లాడిన మీరు హిందువులకు - హిందూ దేవుళ్లకు - దక్షిణ భారతదేశ ప్రజలకు ఎంత మాత్రం మర్యాద ఇస్తారో అర్థం అవుతుందని అమిత్ షాను ప్రశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ - మాజీ ఎంపీ - బహుబాష నటి రమ్యా అయితే ఏకంగా బీజేపీ నాయకులు మఠాధిపతలకు ఎలాంటి మర్యాద ఇస్తారో అమిత్ షాను చూస్తే అర్థంఅవుతోందని కడిగిపారేశారు. ఒక్కలిగుల బ్రిగేడ్ - పలు మఠాధిపతులు అమిత్ షా వైఖరిపై మండిపడుతున్నారు. అయితే అదే ఒక్కలిగ కులానికి చెందిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాకపోవడంతో ఎలాంటి వివరణ ఇవ్వాలి అని సతమతం అవుతున్నారట.