Begin typing your search above and press return to search.
అమిత్ షా మళ్లీ ఫెయిలయ్యాడు
By: Tupaki Desk | 20 Dec 2015 8:55 AM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాణక్యం నామమాత్రం అయిపోయిందా? ఆయన మాటను పార్టీ నేతలే పెడచెవిన పెడుతున్నారా? ఏకంగా ఎంపీ స్థాయిలో ఉన్న బీజేపీ నేతలు షాను లైట్ తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
13 ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ గా ఉన్న ప్రస్తుత కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంచార్జ్ గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ ఆరోపణలకు మద్దతుగా సెప్టెంబర్ 13న అరుణ్ జైట్లీకి బీహార్ కు చెందిన మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ రాసిన లేఖను ఆప్ నేతలు ఉటంకించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ కీర్తి ఆజాద్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమయ్యాయి. అరుణ్ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ సందర్భంగా ఆరోపించారు. అయితే ఈ ఎపిసోడ్ లో కొత్త విషయం తెరమీదకు వచ్చింది.
అరుణ్ జైట్లీని టార్గెట్ గా చేసుకుని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకలను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బయట పెట్టటంతో బీజేపీ ఇరుకునపడింది. ఆ ఎపిసోడ్ లో ఇప్పుడు ఇంటిపోరు తోడుకావటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీజేపీకి చెందిన లోక్ సభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తాజాగా తెరమీదకు వచ్చారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవినీతి అవకతవకలను సాక్ష్యాధారాలతో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు విలేఖరుల సమావేశంలో విడుదల చేస్తానని ప్రకటించారు. మీడియా ముందు ఆడియో-విజువల్ సాక్ష్యాలను బయటపెట్టనున్నట్టు కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని "అకిలీజ్"తో ఆజాద్ పోల్చారు. (అకిలీజ్ : ప్రాచీన గ్రీకు వీరుడైన అకిలీజ్ తన కాలి మడమలోని బలహీనత వల్ల మరణిస్తాడు).
ఇదిలాఉండగా బీహార్‌కు చెందిన ఆజాద్ మంత్రి జైట్లీకి బద్ధ విరోధి. జైట్లీపై అజాద్ తిరుగుబాటు జెండా ఎగురవేసే అవకాశాలున్నాయని పసిగట్టిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతోమాట్లాడవద్దని బుజ్జగించినా ఫలితం లేకపోయింది. జైట్లీ విషయంలో ముందుకు వెళ్లొద్దంటూ అమిత్ షా తనకు హిత బోధ చేసినప్పటికీ ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కీర్తి ఆజాద్ మరోసారి స్పష్టం చేశారు. ఓటమిని అంగీకరించబోనంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి కవితను గుర్తు చేశారు. దీంతో షా రాజకీయం విఫలం అవడం....బీజేపీలోని లుకలుకలు బయటపడటం ఏకకాలంలో జరిగాయని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.