Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ రెడ్డి నేతలపై అమిత్ షా కన్ను
By: Tupaki Desk | 10 May 2017 5:47 AM GMT2019 ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో తమ సత్తాన్ని చాటాలని ఉబలాటపడుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం నరేంద్రమోడీ గాలి అంతటా వీస్తుంటే, తెలంగాణలో మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పార్టీ పరిస్థితి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలకు గాలం వేసే పనిలో పడింది. అధికార - ప్రతిపక్షపార్టీలకు చెందిన కొంతమంది నేతల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వారితో చర్చిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై వేగంగా తన ఆపరేషన్ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో రాయబారాలు జరుపుతుండటం చర్చనీయాంశమైంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీంలోని కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలతో ఒకరికి తెలియకుండా మరొకరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ టార్గెట్ లోని నేతలతో మాట కలుపుతూ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ దూతలు చాపకిందనీరులా ఈ వ్యవహారం నడుపుతూ కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రులకు కూడా వల విసురుతున్నారని సమాచారం. ఒక్కొక్కరిని నేరుగా, వీలుకాకపోతే ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతోంది. బీజేపీలో చేరిక వల్ల కలిగే లాభాలను వివరించడంతోపాటు చేరకపోతే రాజకీయంగా కలిగే నష్టాలను కూడా వివరించి ట్రాప్ లో పడేలా చేసుకుంటున్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే టికెట్ గ్యారంటీ, సహచరులకు కూడా గ్యారంటీ అంటూ హామీలు ఇచ్చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య ఉన్న విభేదాలను అనుకూలంగా చేసుకుంటూ సైతం వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఇటీవల పటాన్ చెరువు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. నందీశ్వర్ గౌడ్ గతంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఉద్యమ సమయంలో నందీశ్వర్ గౌడ్ టీఆర్ ఎస్ పార్టీలో చేరే ప్రయత్నం చేయగా, డీఎస్ ఆయన్ను వెళ్లకుండా నిలువరించారు. ఆ తర్వాత డిఎస్సే టీఆర్ ఎస్ లో చేరారు! దీంతో తనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టించుకోవడంతో నందీశ్వర్ గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు! ఇదంతా కాంగ్రెస్ లో అచ్చిరాకపోవడమే అని అంటున్నారు.
బీజేపీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సొంత బలం కలిగిన నేతల్లో 31 మందిని గుర్తించి, మంతనాలు జరుపుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతోనూ కాషాయ పార్టీ నేతలు చర్చించినట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనిని కోమటిరెడ్డి బ్రదర్స్ ఖండించిన విషయం తెలిసిందే. అయినా ఇంకా వారిపై బీజేపీ నాయకత్వం ఆశ వదులుకోలేదు. అవసరమైతే వారికి పార్టీ అధ్యక్షపదవిని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. ఎప్పుడొచ్చినా ఆ స్థానాన్ని వారికే ఇస్తామని చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అయితే కాంగ్రెస్‌పార్టీలోనే ఉంటామని ఆ ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. మెదక్‌లోనూ ఓ మాజీ మంత్రితో మాట్లాడిన విషయం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతకు ఐదు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ఆఫర్ కల్పించారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే ఎందుకు పార్టీ మారడం అని కొంతమంది నేతలు చెప్పి జారుకుంటున్నారని తెలిసింది. బీజేపీ తమతో జరిపిన చర్చల వివరాలను కొంతమంది నేతలు కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం దృష్టికి చేరవేస్తున్నారని సమాచారం.