Begin typing your search above and press return to search.
తెలంగాణలోనూ బెంగాల్ వ్యూహమే...!
By: Tupaki Desk | 25 July 2019 5:57 AM GMTతెలంగాణలో బెంగాల్ తరహా వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ రంగం సిద్దం చేస్తోందా.. పార్టీ అధినేత అమిత్ షా మదిలో మెదులుతున్న స్ట్రాటజీ ఇదేనా.. అంటే అవుననే అంటున్నాయి ఆపార్టీ వర్గాలు. రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ - 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. తెలంగాణలో బలపడేందుకు రకరకాల వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈక్రమంలోనే తెలంగాణలోని ఒకప్పటి కమ్యూనిస్టు కంచుకోటలపై కషాయ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది.
లెఫ్ట్ భావాలు వదిలేసి - రైట్ రైట్ అనే నేతల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టిందట భారతీయ జనతా పార్టీ. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా తెలంగాణలో కమ్యూనిస్టు కంచుకోటలపై ఆ పార్టీ అధిష్టానం కన్నేసినట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ అమలు చేసిన విధానాన్ని ఇక్కడ కూడా అప్లై చేయడానికి పకడ్బందీగా ప్లాన్ రెడీ చేస్తోంది. రాష్ట్రంలో వామపక్షపార్టీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.
ఇక అధికార టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే మద్దతు కూడా కమ్యూనిస్టు పార్టీలకు లే కుండాపోయింది. దీంతో అదే పార్టీలోని కొందరు కమ్యూనిస్టు నేతలే - గులాబీని ఢీకొట్టేందుకు కాషాయం వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక అధికార పార్టీని ఎదుర్కొవాలంటే - మరో అధికార పార్టీనే సరైన ఆయుధమన్న నిర్ణయానికి కామ్రేడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి లెఫ్టు పార్టీల నేతలు రైట్ భావాలు తగిలించుకుని బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ - టీడీపీ నేతలపైనే కన్నేసిన కాషాయ పార్టీ - ఇక కమ్యూనిస్టులను తమ గూటికి చేర్చుకునేందుకు సిద్దమవుతోంది. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్ నియోజికవర్గంలో - ఆ జిల్లా సీపీఐ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన కమ్యూనిస్టులను చేర్చుకుంది బీజేపీ. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - మాజీ మంత్రి డికే అరుణ మధ్యవర్తిత్వం ఫలించడంతో - కమ్యూనిస్టులు కాషాయగూటికి చేరారు. దీంతో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్దమవుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
కరీంనగర్‌తో ప్రారంభించినా - త్వరలో నల్గొండ - ఖమ్మం జిల్లాల్లో కూడా కమ్యూనిస్టులను తమ పార్టీలో చేర్చుకునేందుకు నేతలు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - సీ పీఎంలనే కాదు - అధికార టీఆర్ ఎస్ పైనా ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది బీజేపీ. అయితే గులాబీ నుంచి కమలం గూటికి వచ్చేందుకు ఇప్పటివరకైతే ఎవరూ సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకే మిగతా పార్టీల నేతలకు వల వేసేందుకు సిద్ధమవుతున్నారట కమలనాథులు.