Begin typing your search above and press return to search.
జగన్ తో పాటే ఏపీకి అమిత్ షా...రాజకీయం మార్చేస్తారా...?
By: Tupaki Desk | 30 Dec 2022 11:30 AM GMTబీజేపీలో అత్యంత బలవంతుడు వ్యూహకర్త అయిన హోం మంత్రి అమిత్ షా ఏపీకి వస్తున్నారు. కొత్త ఏడాది జనవరి 8న ఏపీలో అమిత్ షా టూర్ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఏపీకి వచ్చి చాలా కాలం అయింది. ఆ మధ్యన తిరుపతిలో సౌత్ స్టేట్స్ కౌన్సిల్ మీటింగ్ కి ఆయన వచ్చారు. పనిలో పనిగా పార్టీ గురించి సమీక్ష చేశారు.
ఈసారి మాత్రం ఏపీ పాలిటిక్స్ ని టార్గెట్ చేస్తూ అమిత్ షా టూర్ సాగనుంది అని అంటున్నారు. ఏపీలో అమిత్ షా బీజేపీని బలోపేతం చేయడంతోపాటు పొత్తుల విషయం మీద కూడా సీరియస్ గా ఫోకస్ పెడతారు అని అంటున్నారు.
బీజేపీకి జనసేనతో అధికారికంగా పొత్తు ఉంది. ఆ విషయాన్ని బీజేపీ నేతలే పదే పదే చెబుతున్నారు కానీ జనసేన నుంచి అయితే పెద్దగా రియాక్షన్ ఉండడంలేదు. ఈ మధ్య కో ఆర్డినేషన్ కమిటీని వేయాలని ఏపీ బీజేపీ చూసినా జనసేన నేతల నుంచి స్పందన పెద్దగా లేదు అని అంటున్నారు.
సాక్ష్తాత్తూ నరేంద్ర మోడీ విశాఖ వచ్చి పవన్ని తన వద్దకు పిలిపించుకుని మంతనాలు ఏకంతంగా జరిపారు. అంతా సర్దుకుపోయింది బీజేపీ జనసేన ఒకటి అని అంతా భావించారు.ఇక మీదట రెండు పార్టీలు కలసి తిరుగుతాయని కూడా అంచనా వేశారు. కానీ జరుగుతోంది వేరుగా ఉంది. దాంతో మరోసారి ఏపీ మీద సీరియస్ గానే ఫోకస్ చేయాలని అమిత్ షా ఏపీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.
ఇక జగన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పది రోజుల వ్యవధిలోనే ఏపీకి అమిత్ షా వస్తున్నారు అంటే రాజకీయంగా ఆయన ఒక అజెండా సెట్ చేసుకుని ఉంటారని అంటున్నారు. జగన్ తో భేటీ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా వచ్చి ఉంటాయని అంటున్నారు. ఏపీలో పరిస్థితి మీద ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా ఎంతో కొంత సమాచారాన్ని సేకరించే ఉంటారని తెలుసోంది.
ఇవన్నీ బేరీజు వేసుకుని ఏ విధంగా ఏపీలో కమల రధాన్ని నడపాలి అన్నదే అమిత్ షా ఆలొచనగా చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుల కోసం చూస్తోంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కలవాలని ఓట్లు చీలకూడదు అన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
ఇక వైసీపీ అయితే తెలుగుదేశంతో బీజేపీ కలవరాదు అన్న ఉద్దేశ్యంతో ఉందని అంటున్నారు. మరి తమ రాజకీయానికి ఏది అనుకూలమో దాన్ని చేయడమే మోడీ అమిత్ షాల వ్యూహం అని చెబుతారు. ఆ విధంగా చూస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి దాన్ని బట్టి బీజేపీ అడుగులు ఏ విధంగా వేయాలన్నది అమిత్ షా ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు.
ఏపీలో అమిత్ షా టూర్ లో బహిరంగ సభ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఉంటే కనుక ఆయనేవరిని టార్గెట్ చేస్తారు అన్నది కూడా చూడాలి. ఏపీకి ఇప్పటిదాకా వచ్చిన కేంద్ర మంత్రులు వైసీపీ మీద గట్టిగానే విమర్శలు చేశారు. కానీ మోడీ అమిత్ షాల నోటి నుంచి ఇప్పటిదాకా వైసీపీ వ్యతిరేక మాటలు రాలేదు. అమిత్ షా కనుక వైసీపీ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెడితే ఏపీ పాలిటిక్స్ టోటల్ గా చేంజి అవుతుంది అనే అంటున్నారు. మరి ఢిల్లీ టూర్ తరువాత అంతా తమకు అనుకూలమని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. సడెన్ గా అమిత్ షా ఏపీ టూర్ పెట్టుకోవడం అంటే ఏం జరుగుతోంది అన్న చర్చ అంతటా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.