Begin typing your search above and press return to search.
సారుకు షాకిచ్చేలా.. షా సభ్యత్వం!
By: Tupaki Desk | 27 July 2019 2:30 PM GMTబీజేపీకి చెందిన ముఖ్యనేతల్ని కలిసినప్పుడు వారు తమ అధినేత అమిత్ షా గురించి ఆసక్తికర అంశాల్ని ఏకరువు పెడుతుంటారు. ఆయనకున్న పట్టుదల.. విజన్.. సీరియస్ నెస్ చాలా తక్కువ మందిలో కనిపిస్తాయని చెబుతారు. అహంకారానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు కనిపించే ఆయనలో అలాంటివేమీ ఉండవని.. పార్టీ కోసం చురుగ్గా పని చేసే వారిని ప్రోత్సహిస్తారని.. ఇదే పార్టీ బలంగా చెప్పుకొస్తారు.
చూసేందుకు స్థూలకాయంతో ఉన్నప్పటికీ అమిత్ షా చాలా చురుగ్గా ఉంటారని.. పని రాక్షసుడిగా ముద్దుగా చెప్పుకుంటారు. ఏదైనా టార్గెట్ చేస్తే.. దాన్ని పూర్తి చేసే వరకూ విడిచిపెట్టని మొండితనం ఆయనలో ఎక్కువని చెబుతారు. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకొనే ఆయన.. అలా పెట్టుకున్న తర్వాత.. ఆ రాష్ట్రంలోనే మకాం వేసే విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణను టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన తెలంగాణలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో కానీ.. చుట్టుపక్కల జిల్లాల్లో కానీ ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని.. తెలంగాణలో ఇల్లు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. సభ్యత్వం తీసుకున్న పక్షంలో ఇక్కడ ఉండేలా నివాసం తీసుకోవటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
కేంద్ర హోం శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా.. తెలంగాణలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆయన.. ఇక స్వయంగా ఆయనే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. తొలుత తెలంగాణను క్రాక్ చేసి.. ఆ తర్వాత ఏపీ మీద మరింత ఫోకస్ పెడతారని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారన్న వార్త గులాబీ బాస్ కు షాకిచ్చే అంశంగా చెప్పక తప్పదు.