Begin typing your search above and press return to search.

యడ్యూరప్ప పెద్ద అవినీతిపరుడన్న అమిత్ షా..

By:  Tupaki Desk   |   27 March 2018 11:28 AM GMT
యడ్యూరప్ప పెద్ద అవినీతిపరుడన్న అమిత్ షా..
X
రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోరు జారారు. కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతి పరుడంటూ కామెంట్ చేశారు. అయితే ఆ వెంటనే పక్కన ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో తన తప్పును సరిదిద్దుకున్నారు. కానీ కాంగ్రెస్‌కు ఈ మాత్రం చాలు కదా. వెంటనే ఆ వీడియోనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేసింది. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిందించబోయి...యడ్యూరప్ప పేరును ప్రస్తావించడంతో ఈ భారీ తప్పిదం జరిగింది.

తాజాగా ఓ సమావేశంలో షా మాట్లాడుతూ.. ఈ మధ్యే ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మాట్లాడుతూ.. అత్యంత అవినీతి ప్రభుత్వం కోసం పోటీపడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది యడ్యూరప్ప ప్రభుత్వమే అని అమిత్ షా అన్నారు. ఆ సమయంలో యడ్యూరప్ప పక్కనే ఉన్నారు. షా పొరపాటును గ్రహించిన పక్కనున్న వ్యక్తి వెంటనే ఆయన చెవిలో అసలు విషయం చెప్పారు. ఇదిలాఉండ‌గా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి వెంటనే అమలులోకి వస్తుందని ఈసీ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. కర్నాటక ఎన్నికలు కేవలం ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు నామినేషన్ ఫైలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 27న ఉపసంహరణ ఉంటుంది.