Begin typing your search above and press return to search.

అమిత్ షాతో తేడానే పీకేను మోడీ లైట్ తీసుకున్నారా?

By:  Tupaki Desk   |   27 Jun 2021 2:30 AM GMT
అమిత్ షాతో తేడానే పీకేను మోడీ లైట్ తీసుకున్నారా?
X
2014 ఎన్నిలకు ముందు నుంచి మోడీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. అంతకు ముందు వరకు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్రమోడీ కాస్తా.. సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు నమోగా మారిపోవటం.. ఆయన మీద దేశ ప్రజలకు విశ్వాసం వ్యక్తం కావటమే కాదు.. దేశం బాగుపడాలంటే మోడీ మాత్రమే గెలవాలన్న వేవ్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అయితే.. అదంతా పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ వ్యూహచతురత అన్న విషయం ఎన్నికల ఫలితాలువెలువడిన తర్వాత కానీ బయటకు రాలేదు.

అప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాల మీద అందరి చూపు ఉండేది.దీనికి తగ్గట్లే.. ఆ తర్వాత నుంచి ఒక్కో రాజకీయ పార్టీకి తన వ్యూహాల్ని అమ్మటం.. అక్కడ విజయం సాధించటంతో ఆయన పరపతి పెరగటం మొదలైంది. దీనికి తగ్గట్లే.. పలు రాష్ట్రాల్లో ఆయన వ్యూహచతురత పుణ్యమా అని సానుకూల ఫలితాలు రావటం మొదలైందో.. అప్పటి నుంచి ఆయన ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్.. తమిళనాడు ఎన్నికల్లో పీకే సేవలు అందించిన మమత.. స్టాలిన్ లు ముఖ్యమంత్రి పదవుల్ని చేపట్టటంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగిపోయింది.

అన్నింటికి మించి మోడీషాలు తమ బలాల్ని.. బలగాల్ని పశ్చిమ బెంగాల్ లో మొహరించినా వారికి భంగపాటు తప్పలేదు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా వంద కంటే తక్కువ సీట్లలో టీఎంసీ గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరి మరీ గెలవటం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో పవార్ తో కలిసి జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన తపిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఆయన అనుకున్నంత సులువుగా జట్టు కట్టే పరిస్థితి లేదన్న విషయాన్ని తాజాగా గుర్తించినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ ను ప్రకటిస్తే తాను సేవలు అందిస్తానని చెప్పిన అందరిని ఆశ్చర్యపరిచారు. పీకే నోటి నుంచి అంత మాట వచ్చినప్పటికి కాంగ్రెస్ స్పందించింది లేదు. రానున్న రోజుల్లో ఆయన మాటలకు తగ్గట్లు తెర వెనుక ప్రయత్నలు జరుగుతాయని చెబుతారు. 2014లో తాను సేవలు అందించిన బీజేపీ అంటే పీకే.. ఆ తర్వాత నుంచి కమలనాథులకు ఎందుకు దూరమయ్యారన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి.

2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. షాతో పాటు పీకే కూడా తమ హవాను నడిపే ప్రయత్నం చేశారని చెబుతారు. అయితే.. పీకే తీరును అర్థం చేసుకోవటంలో మోడీ పొరపాటు చేశారని చెబుతారు. ఆయన్ను దూరం చేసుకునేలా మోడీ వ్యవహరించానికి అమిత్ షా కూడా ఒక కారణం చెబుతారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే వచ్చిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగటం.. దీనికి అమిత్ షా వ్యూహ రచన చేయటం.. సదరు ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో.. అమిత్ షా పలుకుబడి మరింత పెరిగిందని చెబుతారు. అప్పటి నుంచి అమిత్ షా వర్సెస్ పీకే అన్నట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది.