Begin typing your search above and press return to search.
అమిత్ షా గుండెల్లో మరీ ఇంత అత్యాశ?
By: Tupaki Desk | 6 March 2016 4:34 AM GMTరాజకీయ నాయకులు తమ మనసులోని మాటల్ని చాలా అరుదుగా బయటపెడుతుంటారు. తొందరపడి ఏదైనా అనేస్తే.. దాని వల్ల కొన్నిసార్లు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడుతుంటారు. తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన పనిలో పని తమ మనసులోని మాటను అనుకోకుండా బయటపెట్టేసినట్లుంది. ఎందుకంటే.. అమిత్ షా నోటి నుంచి వచ్చిన మాటను ఇంతకు ముందు మరే కమలనాథుల నోటి నుంచి విన్నది లేదు.
అలాంటిది ఏకంగా అమిత్ షా నోటి నుంచి ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చిన ఆయన మాట వింటే.. మరీ ఇంత అత్యాశ అన్న అభిప్రాయం కలగకమానదు. ఇంతకీ అమిత్ అత్యాశగా అనిపించే ఆలోచన ఏమిటంటే.. భారత్ రూపురేఖలు మారాలంటే తమకు పాతికేళ్లు అధికారం తమ చేతిలో ఉండాలని వ్యాఖ్యానించారు. అమిత్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య చూసేందుకు ఒకటిగా కనిపించినా.. అందులో రెండు అంశాలు దాగి ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందులో ఒకటి తమకు పాతికేళ్లు నాన్ స్టాప్ పవర్ కావాలన్నది ఒకటైతే.. పాతికేళ్లు తమకు అధికారం ఇస్తే తప్ప భారత్ రూపురేఖలు మొత్తంగా మార్చలేమన్నది.
ఏ పార్టీకి కానీ.. ప్రభుత్వానికి కానీ పాతికేళ్లు నిర్విరామంగా అధికారం ఇస్తే ఇంకేమైనా ఉంటుందా? అంటే కాదు.. ఒకే వ్యక్తి చేతుల కింద ఈ దేశం సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని అమిత్ షా కోరుకుంటున్నారా? సాధారణంగా ప్రధాని స్థాయి అధికారాన్ని రెండు దఫాలు వరుసగా కోరుకోవటం మామూలే. సుడి బాగుంటే ఇంకోసారి చేతిలో ఉండాలని కోరుకుంటారు.
కానీ.. పాతికేళ్లు అన్నది పెద్ద మాట. కాంగ్రెస్ పార్టీ తాను పవర్ లో ఉన్న 60 ఏళ్లలో దేశంలో తీసుకొచ్చిన మార్పును.. తాము కేవలం కొద్ది వ్యవధిలోనే చాలానే మార్పు తెచ్చినట్లుగా కమలనాథులు చెబుతుంటారు. దేశంలో ఎన్ని మార్పులు ఎంతలా జరిగాయన్నది అందరికి తెలిసిందే. విదేశాల నుంచి లక్షల కోట్ల నల్లధనం రాకున్నా ఫర్లేదు.. రోజువారీగా తినే కందిపప్పు.. చింతపండు.. నూనెల్లాంటి నిత్యవసర వస్తువుల ధరలు నేల మీదకు వస్తే అదే పదివేలన్న సంగతి మర్చిపోకూడదు.
దేశంలోని కోట్లాది మందిపై ప్రభావితం చూపే ఒక్క నిర్ణయాన్ని 20 నెలల వ్యవధిలో తీసుకోని మోడీ సర్కారుకు పాతికేళ్ల నాన్ స్టాప్ అధికారం కోరటం అత్యాశే అవుతుంది. ఆశల విషయాన్ని వదిలేసినా.. ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.