Begin typing your search above and press return to search.
కమలనాథులకు చివాట్లు!
By: Tupaki Desk | 14 July 2018 5:21 AM GMTతెలంగాణలో భారతీయ జనతా పార్టీని పటిష్టపరిచేందుకు - ఇక్కడ ఎలాగైన అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర అసంత్రప్తిని - ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో పర్యటనకు వచ్చిన అమిత్ షా హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్లొన్నారు. ఈనాడు పత్రికతో పాటు పలు సంస్ధలకు అధినేత అయిన రామూజీరావును కూడా ఈ సందర్భంగా అమిత్ షా కలుసుకున్నారు. నగరంలో అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులనుద్దేశించి ఆయన ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తో ప్రత్యేకంగా సమావేశమై ఇతర నాయకుల పనితీరుపై అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలని నాయకులకు సూచించినా ఆ దిశగా ఎవరూ అడుగులు వేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. "మీరు చేస్తున్న కార్యక్రమాలు పార్టీని అధికారంలోకి తీసుకురాలేవు. పార్టీ నిర్ణయించిన విధానాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు పని చేస్తున్నారు " అని అమిత్ షా తెలంగాణ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బూత్ స్ధాయి వివరాలను పూర్తి చేయకపోవడం - పైగా వాటిని కుదించడం వంటి చర్యలపై అమిత్ షా తీవ్ర స్ధాయిలో మండిపడినట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ - చివరకు ఏమాత్రం పట్టులేని ఒడిసా - తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ బూత్ స్ధాయి జాబితాలను పూర్తి చేశారని - ఇవి కూడా చేయలేని మీరు రేపు అధికారంలోకి ఎలా వస్తారంటూ అగ్గిమీద గుగ్గిలం అయినట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేయాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఇక్కడింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అమిత్ షాకు మింగుడు పడలేదు. పార్టీ నిర్దేశించిన సంపర్క్ సే సమర్ధన్ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. " పెద్దవారిని కలిసేందుకు ఢిల్లీ పెద్దలే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ముఖ్య నాయకులు కూడా వారిని కలవవచ్చు. మీ దగ్గర కేంద్ర మంత్రులున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన నాయకులున్నారు. తెలంగాణలో మీకో గుర్తింపు ఉంది. మీరు వెళ్లి వారిని కలవవచ్చు. అన్నింటికి అధిష్టానంపై ఆధారపడితే ఎలా " అని తెలంగాణ నాయకులను నిలదీసినట్లు సమాచారం. తాను మళ్లీ సెప్టెంబర్ నెలలో వస్తానని - ఈ లోగా ఇక్కడి సమస్యలన్ని పరిష్కరించి సంసిద్ధులుగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో పాటు దత్తాత్రేయ - కిషన్ రెడ్డి వంటి నాయకులను ఆదేశించినట్లు తెలిసింది.