Begin typing your search above and press return to search.
కేసీఆర్, జగన్ లకు ఫోన్ చేసిన అమిత్ షా.. ఎందుకంటే?
By: Tupaki Desk | 19 Jun 2020 5:15 AM GMTదేశం అల్లకల్లోలంగా ఉంది. ఓ వైపు కరోనా.. మరో వైపు లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయం.. మరోవైపు చైనాతో సరిహద్దు ఘర్షణ.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదా? అంటే ఔననే అంటున్నాయి. ఈ క్రమంలోనే దేశ ఆర్థికమందగమనం.. చైనాతో ఘర్షణలు సహా అన్ని సమస్యలపై ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకునేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
ఈ క్రమంలోనే నేడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు. దీని ప్రధాన అజెండా మాత్రం చైనాతో సరిహద్దు ఘర్షణ వివాదం అని తెలుస్తోంది. మోడీతో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తోంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి పరిస్థితులను విపక్ష, మిత్రపక్ష నేతలకు ప్రధాని మోడీ వివరించనున్నారు.
ఇప్పటికే ఈ భేటిలో పాల్గొనాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా.. తాజాగా ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. అఖిలపక్షం ఉద్దేశాలను సీఎం జగన్ కు అమిత్ షా వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా జగన్ ను అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
ఇక మరోపక్క ఇదే భేటిపై సీఎం కేసీఆర్ తోనూ అమిత్ షా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.