Begin typing your search above and press return to search.
అమిత్ షా భార్య ఆస్తి 16రెట్లు
By: Tupaki Desk | 31 March 2019 5:11 AM GMTగుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గాంధీనగర్ నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. కానీ ఇందులో అనూహ్యంగా ఆయన భార్య ఆస్తులు 16 రెట్లు పెరగడం విశేషం. అమిత్ షా భార్య సోనాల్ షా ఆదాయం ఈ ఐదేళ్లలో 14లక్షల నుంచి రూ.2.3 కోట్లకు పెరగడం విశేషం.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన స్థిర, చర ఆస్తుల మొత్తం విలువ రూ.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇక చనిపోయిన తన తల్లి ద్వారా సంక్రమించిన వారసత్వ ఆస్తి 23 కోట్లు అని అమిత్ షా అఫిడవిట్ లో పేర్కొన్నారు.
అమిషా ఆదాయం 2017-18 ఆదాయం రూ.53,90,970 గా చూపించారు. ఇదే షా 2013-14లో తన ఆదాయాన్ని 41,93,218గా చూపించారు. ఆయన భార్య ఆదాయం 14,55,637 గా చూపించారు. ఇప్పుడు 2013-14 నుంచి 2017-18 వచ్చే సరికి అమిషా భార్య ఆదాయం రూ.2.3 కోట్లకు చేరడం విశేషం.
2014-15లో సోనాల్ షా ఆదాయం 39,75,970 రూపాయలుగా ఉంది. ఇది 2015-16లో రూ. కోటికి పెరిగింది. రెవెన్యూ మూలాల నుంచి అద్దె మరియు వ్యవసాయం, డివిడెండ్ ల నుంచి ఆదాయం మూలాలను చూపించారు.
ఇక షా అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం.. నాలుగు క్రిమినల్ కేసులు తనపై పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.