Begin typing your search above and press return to search.
అమిత్ షాకు ఆ లక్కీ ఛాన్సు వస్తుందా?
By: Tupaki Desk | 10 July 2016 7:47 AM GMTబీజేపీ - ప్రధాని మోడీ అంటే విరుచుకుపడే ఆమ్ ఆద్మీ పార్టీ నేత - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మైండ్ గేమ్ ఆడడంలో సిద్ధహస్తుడే. రాజకీయ అనుభవం తక్కువే అయినా ఈ విషయంలో మాత్రం ఆయన గట్టోడే. ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆప్ ను పంజాబ్ లోనూ ప్రధాన పార్టీగా నిలుస్తూ బీజేపీకి గుబులు రేకెత్తిస్తోంది. తాజాగా ఆప్ గుజరాత్ పైనా కన్నేసింది. అక్కడ వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారపర్వం మొదలుపెట్టారు. ఇటీవల ఆయన సోమనాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.. తాజాగా ట్విట్టర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు గుజరాత్ రాజకీయాల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయి. గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ స్థానంలో త్వరలో అమిత్ షాను నియమిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతల నుంచే తనకు పక్కా సమాచారం అందిందని..మార్పు ఖాయమని ఆయన అన్నారు. దీంతో కేజ్రీవాల్ కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గుజరాత్ గా మారింది.
గుజరాత్ లో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ అవినీతి పాలన ప్రజలకు విసుగు తెప్పిస్తోందని.. మోడీ కూడా ఆమె పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుందని.. ముఖ్యమంత్రిగా అమిత్ షాను నియమిస్తున్నట్టు తనకు తెలిసిందని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గుజరాత్ లో బీజేపీ పని అయిపోయిందని.. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. కాగా కేజ్రీవాల్ పనిలోపనిగా ఆనందిబెన్ పైనా ఆరోపణలు చేశారు. సూరత్ లో తన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా ఆనందీ బెన్ అడ్డుకున్నారని ఆరోపించారు.
అయితే.. ఆనంది పాలనపై బీజేపీలో అసంతృప్తి ఉన్న మాట నిజమే కానీ అమిత్ షా ను సీఎం చేస్తారన్న గ్యారంటీ లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ ఆయన్ను సీఎం చేస్తే గుజరాత్ లో ఆప్ ను తొక్కేస్తారన్న భయంతోనే ముందుగానే కేజ్రీ అలాంటి ఫీలర్లు వదులుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. కేజ్రీవాల్ - మోడీలు ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకాలు కాబట్టి కేజ్రీ తమ పార్టీలో వ్యవహారాలను ముందే ఊహించి చెబితే వాటిని నిజం చేయడం ఎందుకన్న ధోరణితో మోడీ ఉంటారని.. అందుకే అమిత్ షాను సీఎం చేయరని.. అప్పుడు కేజ్రీ కి గుజరాత్ లో ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు. ఈ ప్లాన్ తోనే కేజ్రీవాల్ ఇలాంటి కామెంట్లు చేశారని చెబుతున్నారు.