Begin typing your search above and press return to search.

కులం, మ‌తంపై ...అమితాబ్ ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   10 Oct 2015 6:16 PM GMT
కులం, మ‌తంపై ...అమితాబ్ ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు
X
బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదురైన నేప‌థ్యంలో త‌న కులం, మ‌తప‌ర‌మైన విష‌యాల‌ను బిగ్‌బీ త‌న మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించారు. పాకిస్థానీ గాయకుడు గులాం అలీ శివసేన హెచ్చరికల నేపథ్యంలో ముంబై, పుణెల్లో గులాం అలీ కచేరీలు రద్దయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బీ త‌న ఆవేద‌న‌ను వెల్ల‌డించారు.

"నేను అమితాబ్ బ‌చ్చ‌న్‌ను. క‌ళాకారుడిని అయిన నాకు కులం, మ‌తం అనేది ఉండ‌దు. ద‌య‌చేసి మ‌మ్మ‌ల‌ను ఆ వివాదంలోకి లాగ‌వ‌ద్దు " అని బిగ్‌బీ త‌న బ్లాగ్‌లో రాశారు. గులాం అలీ క‌చేరీలు ర‌ద్దైన నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా... మ‌హారాష్ర్ట‌లో రైతులు మృత్యువాత ప‌డుతుంటే క‌చేరీల ఏంట‌ని శివ‌సేన హెచ్చ‌రిక చేసింది. ఈ వ్యాఖ్య‌ల‌ త‌ర్వాత నొచ్చుకున్న అలీ త‌న క‌చేరీలు ర‌ద్దుచేసుకోవ‌డంతో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు తమ రాష్ర్టాల్లో సంగీత కచేరీ చేయాలని అలీని ఆహ్వానించాయి. సంస్కృతికి, సంగీతానికి సరిహద్దులు ఉండవని పేర్కొన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గజల్ గాయకుడు గులాం అలీకి ఫోన్‌చేసి హస్తినలో పాటల కచేరీ నిర్వహించాలని ఆహ్వానించారు.