Begin typing your search above and press return to search.
అమితాబ్ మంచం ఎందుకు ఊగింది?
By: Tupaki Desk | 4 Jan 2016 11:27 AM GMT బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ సినిమా షూటింగ్ కోసం కోల్ కతాలో ఉన్నారు.. సోమవారం వేకువజామున ఆయన పడుకున్న మంచం ఊగిపోయింది.. మంచం ఎందుకు ఊగిందో అర్థం కాని ఆయన కాసేపు ఆలోచించి పడుకుని ఆరు గంటలకు నిద్ర లేచారు. ఆ తరువాత గదిలో టీవీ పెట్టుకుని చూడగానే విషయం అర్థమైంది. భూకంపం కారణంగానే రాత్రి తన మంచం ఊగిందని అమితాబ్ తెలుసుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు భూకంపం అనుభవంలోకి రావడం అదే ప్రధమం అట. పొద్దున్న విషయం తెలిసిన తరువాత ఆయన ట్విట్టర్ లో ఈ సంగతంతా రాశారు. తెల్లవారుజామున తన మంచం కదిలిందనీ, అయితే భూకంపం కారణంగానే మంచం కదిలిందన్న విషయం తెల్లవారిన తరువాత తెలిసిందని అమితాబ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.
సోమవారం వేకువజామున ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. భారత్, బర్మా సరిహద్దుల్లో వచ్చిన ఈ భూకంపం కారణంగా మణిపూర్‌లో ఆరుగురు మృతి చెందారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఇంఫాల్‌లో కొన్ని ఇళ్లకు బీటలు వారాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మణిపూర్ లోని టమెంగ్లాంగ్ జిల్లా కేంద్రంగా ఈ భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదయింది. మణిపూర్ తో పాటు నాగాలాండ్ - అస్సాం - బెంగాల్ - జార్ఖండ్ లోనూ దీని ప్రభావం కనిపించింది.