Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పై మనసు పారేసుకున్న మెగా స్టార్
By: Tupaki Desk | 22 Feb 2018 7:57 AM GMTబిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఉన్నట్లుండి ఏమైందో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్నారు. ప్రస్తుతం పీఎం మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ - మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసీడర్ గా కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వం కంటే ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని - ఆపార్టీకి చెందిన నేతల్ని అమితాబ్ ఫాలో అవ్వడం ఆసక్తికరంగా మారింది.
గాంధీ- నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడు - రాజీవ్ గాంధీకి మంచి మిత్రుడు . ఆ చొరవతోనే రాజీవ్ గాంధీ హయాంలో బిగ్ బి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అలా 1984లో అలహాబాద్ లోక్ సభ స్థానం నుండి అమితాబ్ ఉత్తరప్రదేశ్ సీఎం హెచ్.ఎం. బహుగుణతో పోటీపడ్డారు. అప్పుడు జరిగిన సాధారణ ఎన్నికల్లో 68.2% ఓట్లను పొంది అద్భత విజయాన్ని అమితాబ్ సొంతం చేసుకొన్నారు. అప్పటి వరకు రాజకీయాల్లో కొనసాగిన బిగ్ బికి మాయని మచ్చగా మిగిలిపోయింది బోఫోర్స్ కుంభకోణం
1987ఏప్రిల్ లో స్వీడిష్ రేడియో బోఫోర్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. నాడు ప్రభుత్వం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 155ఎం ఎం హోవిట్జర్ శతఘ్నులను భారీ ఎత్తున కొనుగోలు చేయడానికి స్వీడన్ కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ బోఫోర్స్ తో ఒప్పందం కుదుర్చుకుందని బట్టబయలు చేసింది. అయితే ఆ కాంట్రాక్ట్ తనకు దక్కడానికి బోఫోర్స్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు - ప్రభుత్వ అధికారులు - సైనికాధికారులకు భారీగా ఎత్తున ముడుపులు చెల్లించిందని ఆరోపణలు చేసింది.
దీన్ని ప్రధానం అంశంగా చేసుకున్న భారత్ కు చెందిన ఓ నేషనల్ మీడియా దినపత్రిక బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ - అయన తమ్ముడు అజితాబ్ లు భాగస్వాములని కధనాల్ని ప్రచురించడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. దీంతో అమితాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలంటూ అమితాబ్ అ పత్రికను కోర్టుకు తీసుకొని వెళ్ళాడు. అయితే బచ్చన్ సోదరులు నిర్దోషులని - బోఫోర్స్ కుంభకోణం లో వారికి సంబంధం లేదని విచారణ చేపట్టిన స్వీడిష్ కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చాయి. అయినా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో తాను గడిపిన చీకటి రోజుల్ని అమితాబ్ గుర్తుచేసుకున్నారు. బోఫోర్స్ తన పాత్రలేదని తెలిసినా ఆ మచ్చ తమ కుటుంబాన్ని వదల్లేదని మదనపడ్డ అమితాబ్ - ఆనాడు తమ కుటుంబం అనుభవించిన బాధను అప్పుడంటిన మరకలను ఎవరు తొలగించగలరని, చేదు పరిణామాలతో నరకం చూసిన తాము ఏవిధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు . అలా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిన బిగ్ బి ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి దగ్గరకానున్నాడు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే అమితాబ్ బచ్చన్ పొలిటికల్ కామెంట్స్ కు రిప్లయి ఇవ్వరు. అమితాబ్ సోషల్ మీడియా విషయానికొస్తే ట్విట్టర్ లో 3.31 కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మొత్తంగా 1689మంది ఫాలో అవుతున్నారు. వీరిలో తాను ప్రచారం చేస్తున్న బీజేపీ కంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన నేతల్ని ఫాలో అవ్వడం చర్చకు దారి తీసింది.
అమితాబ్ తొలత రాహుల్ గాంధీ తో మొదలు పెట్టి ఆ పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం - కపిల్ సిబల్ - అహ్మద్ పటేల్ - అశోక్ గెహ్లాట్ - అజయ్ మాకెన్ - జ్యోతిరాదిత్య సింథియా - సచిన్ పైలట్ - సీపీ జోషి - నేతలు మనీష్ తివారీ - షకీల్ అహ్మద్ - సంజయ్ నిరుపమ్ - రణ్ దీప్ సుర్జేవాలా - ప్రియాంక చతుర్వేది - సంజయ్ ఝాలను ఫాలో అవుతున్నారు. వీరితో పాటు ప్రతిపక్షానికి చెందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ య యాదవ్ - ఆయన కూతురు మిసా భారతి - జేడీయూ అధినేత నితిశ్ కుమార్ - సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులను అమితాబ్ ను ఫాలో అవుతున్నారు. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా - ఎన్సీపీ నేత సుప్రియా సూలేను కూడా మెగాస్టార్ ఫాలో అవుతుండగా..బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ - సురేశ్ ప్రభు బిగ్ బీని ఫాలో అవుతున్నారు.
మొత్తానికి బిగ్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనివెనుక ఆంతర్యం ఏదైనా ఉందా? లేదా కాకతాళీయంగానే వారిని ఫాలో అవుతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.