Begin typing your search above and press return to search.
జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బీ!
By: Tupaki Desk | 19 Jun 2017 2:48 PM GMTజులై 1 నుంచి అమలు కాబోతున్న జీఎస్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం జీఎస్టీని ప్రమోట్ చేయడం కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. అమితాబ్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ నియమించినట్టు తెలిసింది.
జీఎస్టీపై ఇప్పటికే 40 సెకన్ల వీడియో ఫీచరింగ్ ను షూట్ చేశారు. దాన్ని వివిధ మాధ్యమాల్లో సర్క్యులేట్ చేయనున్నారు. '' ఏకీకృత జాతీయ మార్కెట్ ను ఏర్పాటుచేయడానికి జీఎస్టీ ఓ అద్భుత కార్యక్రమం'' అని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. వీడియోకు అటాచ్డ్ గా ఈ ట్వీట్ చేసింది. మువ్వన్నెల జెండాలోని మూడు రంగులను వివరించినట్లుగా ఈ వీడియోలో జీఎస్టీ గురించి బచ్చన్ వివరించారు.
' ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్' ను సృష్టించే విధంగా జీఎస్టీ దోహదం చేస్తుందని అమితాబ్ పేర్కొన్నారు. ఈ అతిపెద్ద పన్ను వ్యవస్థను జులై1 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించిన ప్రమోషన్ ప్రక్రియను అమితాబ్ చేపట్టనున్నారు.
జీఎస్టీకి అంతకముందు బ్రాండ్ అంబాసిడర్ గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ వ్యవహరించారు.అవసరమైన వస్తువులకు 5 శాతం, కార్లు, కన్జూమర్ డ్యూరెబుల్స్ అత్యధికంగా 28 శాతం పన్ను రేట్లను వేయనున్నారు. మిగతావస్తువులు 12 - 18 శాతం పరిధిలోకి రానున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/