Begin typing your search above and press return to search.

అమీర్ విషయంలో అది ఇన్ క్రెడిబుల్ డెసిషన్

By:  Tupaki Desk   |   7 Jan 2016 5:42 PM GMT
అమీర్ విషయంలో అది ఇన్ క్రెడిబుల్ డెసిషన్
X
బాలీవుడ్ అసహన హీరో ఆమీర్ ఖాన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇండియాలో అసహనం ఉంది... ఎక్కడికైనా వెళ్లిపోదామని నా భార్య అంది అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పిన ఆయన్ను భారత పర్యాటక శాఖ దూరం పెట్టింది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన్ను తొలగించి ఆ స్థానంలో అమితాబ్ ను నియమించింది.

రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఆయన బాధ్యతారాహిత్యంగా అలా మాట్లాడడాన్ని సీరియస్ గా తీసుకుని అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించింది. దీంతో ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, అక్షయ్ కుమార్ వంటి అందరి పేర్లు వినిపించాయి. చివరకు ఆ అవకాశం బిగ్ బి అమితాబ్ కు దక్కింది. మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా లేకున్నా కూడా ఇండియా ఇన్ క్రెడిబుల్ గానే ఉంటుందని పేర్కొన్నాడు. అంతకుమించి మాట్లాడితే సీను ఇంకా బ్యాడ్ అవుతుందని ఆయనకు ఇప్పటికే అర్థమైనట్లుంది.