Begin typing your search above and press return to search.
దాయాదుల పోరులో బిగ్ బి స్పెషల్
By: Tupaki Desk | 16 March 2016 4:04 AM GMTమరోసారి దాయాదుల మధ్య పోరుకు రంగం సిద్ధమవుతోంది. మరో మూడు రోజులు ఆగితే.. పసందైన క్రికెట్ ను ప్రపంచం చూడనుంది. ఆగర్భ శత్రువులుగా మాదిరిగా వ్యవహరించే దాయాది పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానున్న విషయం తెలిసిందే. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్ కు మరో స్పెషల్ అట్రాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.
ఈ నెల 19న భారత్.. పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆలపించనున్నారు. మ్యాచ్ ముందు జాతీయ గీతాన్ని ఆలపించేందుకు బిగ్ బీ ఓకే చెప్పేయటం.. ఈ విషయాన్ని ఒకవైపు అమితాబ్.. మరోవైపు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రకటించింది. ఈ ఏర్పాటుకు బెంగాల్ క్రికెట్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నసౌరవ్ గంగూలీ చొరవతోనే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు.
కారణం ఎవరైనా కానీ.. ఒక అరుదైన ఘటనకు ఈడెన్ గార్డెన్ వేదిక కానుంది. మరోవైపు.. పాక్ జట్టు సైతం తమ జాతీయ గీతాన్ని ప్రఖ్యాత క్లాసికల్ సింగర్ షఫాకత్ అమనాత్ అలీతో పాడించాలని భావిస్తోంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. జాతీయ గీతాలాపన మ్యాచ్ కు తగ్గట్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.