Begin typing your search above and press return to search.
ఈ టర్మ్ కాగానే అమిత్ షాను సాగనంపడమే!
By: Tupaki Desk | 14 Nov 2015 3:55 AM GMTభారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరాటాలు తారస్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. పార్టీలో అంతర్గత విబేధాలు నివురు గప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి. పైకి అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ.. పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా స్పష్టంగా ఏర్పడిందని.. చాణక్యులను మించిన కొందరు నాయకులు మాత్రం.. అటూ ఇటూ కాకుండా.. కొంత తెలివితేటలను ప్రదర్శిస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మోడీ టీం - అద్వానీ టీంగా పార్టీ ఏర్పడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో భాజపా ఓడిపోవడం వలన ఆ పార్టీకి జరిగిన నష్టం ఏదైనా ఉన్నదా అంటే.. అది కేవలం.. ఆ పార్టీ అంతర్గత విభేదాలు మొత్తం రచ్చకెక్కడం తప్ప మరొకటి కాదని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
బీహార్ లో ఓటమికి ప్రధాని కారణం కాదని, ఇలాంటి ఓటములకు వేర్వేరు కారణాలు అనేకం ఉంటాయని ఒక కోటరీ చాలా బలంగా వాదిస్తున్న సంగతిని అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే కీలకమైన విషయం ఏంటంటే.. బీహార్ లో ఓటమి వలన.. మోడీకంటె పార్టీ అధ్యక్షుడిగా మోడీ ఆశీస్సులతో గద్దె ఎక్కి అప్పటినుంచి తన ఇష్టానుసారం చెలరేగిపోతున్న అమిత్ షాకే ఎక్కువ నష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అమిత్ షా స్థాయి ఏమిటి? ఆయన పార్టీకి అందించిన సేవలు ఏమిటి? అనే దానితో నిమిత్తం లేకుండా.. గుజరాత్ లో మోడీకి విశ్వసనీయుడిగా పనిచేసాడనే ఏకైక ప్రాతిపదిక మీద ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసేశారు. సహజంగానే మోడీ తాను అనుకున్నట్లుగా ప్రచారాన్ని సాధించడంలో సిద్ధహస్తుడు గనుక.. అమిత్ షా కూడా వ్యూహకర్తగా మొనగాడు అంటూ ప్రచారం చేయించారు. గుజరాత్ లో అమిత్ షా గెలిపించాడో, మోడీ పాలన గెలిపించిందో తర్వాతి సంగతి.. అయితే అమిత్ షా వ్యూహకర్తగా తిరుగులేని వ్యక్తి అని ఆ తర్వాత నిరూపణ అయిన దాఖలాలు ఏమీ లేవు. పైగా ఎదురైనవన్నీ వరుస వైఫల్యాలు మాత్రమే. ఈనేపథ్యంలో బీహార్ ఎన్నికల ప్రచార సమయంలోనే.. త్వరలో అమిత్ షా పదవీకాలం ముగుస్తుంది గనుక.. కొత్త అధ్యక్షుడు వస్తాడంటూ ఒక ప్రచారం మొదలైంది. కొందరు దానిని ఖండించారు. కానీ ప్రస్తుత పరిణామాల్లో మోడీ వ్యతిరేక కూటమి కూడా తమ వాణిని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమిత్ షా టర్మ్ పూర్తి కాగానే ఆయనను తప్పకుండా ఇంటికి పంపిస్తారని కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు ఇస్తారని అనుకుంటున్నారు.