Begin typing your search above and press return to search.

రేవంత్ కోసం అమిత్ షా వల

By:  Tupaki Desk   |   7 Dec 2015 7:12 AM GMT
రేవంత్ కోసం అమిత్ షా వల
X
తెలంగాణలో సరైన నాయకుడి కోసం అన్నేషిస్తున్న బీజేపీ ఇప్పుడు తన మిత్రపక్షం నుంచే ఆ సరైనోడిని ఎంచుకోబోతుందా? అందుకోసం మిత్రపక్షంతో ఘర్షణకైనా సిద్దపడుతుందా ? అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం పవర్ ఫుల్ లీడర్ కోసం అన్వేషిస్తోంది. వారికి ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఆ సరైనోడు కనిపిస్తున్నాడని అంటున్నారు. బీజేపీ జాతీయ నేతల దృష్టి రేవంత్ పై పడినట్లు సమాచారం.

వరంగల్ ఉప ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ ప్రచారానికి రాగా ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేవంత్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన ఆయన ఆశ్చర్యపోయారట. అప్పటికప్పుడు ఆయన మీరు బీజేపీలో వస్తే సీఎం పోస్టు ఇస్తాం అని కూడా ఆఫర్ చేశారు. అక్కడితో ఆగకుండా ఆయన బీజేపీ అధిష్ఠానానికి విషయం చేరవేశారట. రేవంత్ ను బీజేపీకి తీసుకొస్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని చెప్పారట. దీంతో అమిత్ షా ఇప్పుడు ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ, టీడీపీతో ఏమైనా ఇబ్బంది వస్తుందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే.. తెలంగాణలో కాబట్టి పెద్దగా సమస్య ఉండదని అనుకుంటున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల్లో తెలంగాణ బీజేపీని రేవంత్ నేతృత్వంలో నడిపించాలని అమిత్ అనుకుంటున్నారట.