Begin typing your search above and press return to search.
జూన్ నుండి అక్కడ కేవలం స్వదేశీ వస్తువులు మాత్రమే ..!
By: Tupaki Desk | 13 May 2020 2:00 PM GMTకేంద్ర బలగాలకు చెందిన క్యాంటీన్లలో కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే అమ్మనున్నట్లు కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షా తెలిపారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్.. క్యాంటీన్లలో ఇక నుంచి కేవలం మన దేశంలో తయారైన వస్తువులను అమ్మనున్నారు. ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ నియమాన్ని అమలు చేయనున్నారు. పది లక్షల దళాలకు చెందిన సుమారు 50 లక్షల కుటుంబాలు ఇక స్వదేశీ వస్తువులు కొంటారని మంత్రి తెలిపారు.
మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరూ స్థానిక వస్తువులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధవారం ట్వీట్ చేశారు. ఈ మహమ్మారి నేపథ్యంలో నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులకు ఎక్కువ విలువ ఇవ్వాలన్నారు. లోకల్ బ్రాండ్లే.. జీవన మంత్రం కావాలన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇదే అభ్యర్థన చేశారు. మన దేశంలో తయారైన ప్రొడక్ట్స్‌ను ఎక్కువ శాతం కొనుగోలు చేయాలన్నారు. సీఏపీఎఫ్ కింద పనిచేసే సీఆర్‌ఫీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ, అస్సాం రైఫిళ్ల క్యాంటీన్లలో ప్రతి ఏడాది సుమారు 2800 కోట్ల వస్తువుల అమ్మకాలు జరుగుతుంటాయి.
సీఏపీఎఫ్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సాశాస్త్రా సీమా బాల్ (ఎస్ ఎస్ బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎన్ జీ)తోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వీరంతా భారతదేశంలో తయారైన వస్తువులను ప్రజలు ఉపయోగించాలని, ఇతరులు కూడా ఇలాగే చేయాలని హోంమంత్రి కోరారు.