Begin typing your search above and press return to search.
షా అసహనంః ఏపీకి ఏం చేయలేదనటం ఏంటి?
By: Tupaki Desk | 6 March 2016 6:17 PM GMTసార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయాలు మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని అంశాలను స్పృశించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న సంకల్ప ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పవిత్ర గోదావరి తీరాన సంకల్ప ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నంత వరకు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎలాంటి లోటు రాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని, వారి ఆత్మగౌరవం బీజేపీతోనే నిలబడుతుందని అమిత్‌షా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన సహాయంపై మాట్లాడేందుకు వారం రోజులు పడుతుందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఏ మేరకు చేయూతనందిస్తుందో తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సినంత సహాయం చేస్తోందని స్పష్టం అమిత్ షా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని, ఆ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 31 గ్రామాలను ఎంపిక చేసినట్లు అమిత్‌షా చెప్పారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.65 వేల కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. 2019 నాటికి రాష్ట్రంలో విద్యుత్ లేని ఇల్లు ఉండబోదని చెప్పారు. రాష్ట్రానికి లక్షా 40 వేల కోట్ల విలువైన పథకాలు అందించినట్లు తెలిపారు. ఇన్ని చేసినా ఆంధ్రాకు కేంద్రం సహాయం చేయడం లేదని దుష్ప్రచారం చేయడం తగదని షా అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో 30 ఏళ్ల తర్వాత బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని అమిత్‌షా అన్నారు. బీజేపీ 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు.బీజేపీ ఉత్తరాదికి చెందిన పార్టీ కాదని, దక్షిణాదిలోనూ తమ సత్తా చాటుతామని పేర్కొన్నారు.