Begin typing your search above and press return to search.
మెజార్టీ రాకున్నా చక్రం తిప్పిన షా.. ఖట్టరే సీఎం
By: Tupaki Desk | 26 Oct 2019 6:03 AM GMTకింద పడినా పైచేయి మాదే అన్నట్లు వ్యవహరించటం కొందరికి అలవాటు. అలాంటి తీరు తమలో టన్నుల లెక్కలో ఉన్నాయన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. గతంలో వల్లించిన సిద్ధాంతాలు.. ఆదర్శాలకు భిన్నంగా అధికారం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించటం కమలనాథులకు ఇప్పుడో అలవాటుగా మారింది. ఇటీవల విడుదలైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీ ఏర్పడటం తెలిసిందే.
అధికార బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఆరు సీట్లు తక్కువ పడటం తెలిసిందే. కాంగ్రెస్ కు సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్న వేళ.. తమకున్న అవకాశాల్ని అందిపుచ్చుకోవటానికి వీలుగా బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. పది సీట్లు సొంతం చేసుకున్న జేజేపీతో కీలక చర్చలు జరిపింది.
ముఖ్యమంత్రి పదవిని తమకు.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమిక పోసిస్తున్న జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా భేటీ అయ్యారు.
వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దీపావళి పండుగ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ సర్కారు ఏర్పాటులో తమకు అవకాశాల్ని దుష్యంత్ మొహమాటం లేకుండా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. పలు డిమాండ్లను అమిత్ షా ముందు పెట్టగా.. వాటన్నింటికి షా ఓకే చెప్పటంతో హర్యానాలో బీజేపీ సర్కారు కొలువు తీరటం ఖాయమైంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇరువురు అధినేతలు సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టార్ నే తదుపరి సీఎంగా ఎంపిక చేయనున్నారు.