Begin typing your search above and press return to search.
'RRR' గురించి అయితే.. రామ్ చరణ్ ను ఎందుకు పిలవలేదు..!
By: Tupaki Desk | 22 Aug 2022 5:56 AM GMTబీజేపీ అగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి.. అమిత్‌షా.. గత రాత్రి.. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యటించిన షా.. మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెడు తూనే.. ఇటు రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న పవనాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర మంలో ఆయన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ వరుసలో.. ఆయన జూనియర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే.. దీనిపై బీజేపీ వాదన ఒక విధంగా ఉంది.. ఇటీవల జూనియర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీని అమిత్ షా చూశారని.. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో ఆయన జీవించడం పై షా ముగ్ధులయ్యారని.. అందుకే.. ఆయనను అభినందించేందుకు.. అమిత్ షా.. ఇలా ప్రత్యేకంగా.. డిన్నర్ భేటీకి పిలిచారని అన్నారు.
అయితే.. ఇక్కడే ఎక్కడో తేడా కొడుతోంది. ఎందుకంటే.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో.. జూనియర్ తో పాటు.. రామ్ చరణ్ కూడా నటించారు.
పైగా రామ్ చరణ్ ఏకంగా.. అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషించారు. గత నెలలో.. ఏకంగా.. ప్రధాని మోడీ.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆయన కుటుంబంతో కూడా మమేకం అయ్యారు. అంతేకాదు.. స్వాతంత్య్ర సమరయోధుల జాబితాలో ఏపీ నుంచి అల్లూరికి ఫస్ట్ ప్లేస్ దక్కుతుందని కూడా పేర్కొన్నా రు.
సో.. దీనిని బట్టి.. నిజంగానే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని షా చూసి.. అభినందించాలని అనుకుంటే.. అల్లూరి పాత్ర ధారి.. రామ్ చరణ్ ను కూడా అభినందించాలి.
ఆయనను కూడా జూనియర్ తో పాటు.. నోవాటెల్ కు పిలిచి ఉండాల్సింది. కానీ, షా.. మాత్రం కేవలం జూనియర్ వరకే పరిమితమయ్యారు. వాస్తవానికి జూనియర్ నటన ఓకే అన్నా.. కొమరం భీం పాత్ర గురించి.. జాతీయస్థాయిలో పెద్దగా చర్చకు రాలేదు. అయినప్పటికీ జూనియర్ నటన మెచ్చే ఆయన ను పిలిచారంటూ.. బీజేపీ వాదిస్తోంది. కానీ, లోతుగా చూస్తే.. మాత్రం ఈ వాదనలో పసలేదని.. కేవలం రాజకీయాల గురించిన ఎలిమెంట్ ఏదో.. జూనియర్ తో పంచుకునేందుకే షా మొగ్గు చూపారని.. అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో.. చూడాలి.