Begin typing your search above and press return to search.

మా ద‌గ్గ‌ర ఉత్ప‌త్తి అవుతున్న రెమ్‌డిసివ‌ర్‌పై మీ పెత్త‌నం ఏంటి?

By:  Tupaki Desk   |   22 April 2021 10:30 AM GMT
మా ద‌గ్గ‌ర ఉత్ప‌త్తి అవుతున్న రెమ్‌డిసివ‌ర్‌పై మీ పెత్త‌నం ఏంటి?
X
క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ‌.. వ్యాక్సిన్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త వంటివి రాష్ట్రాల‌ను వ‌ణికిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మా ద‌గ్గ‌ర ఉత్ప‌త్తి అవుతున్న రెమ్‌డిసివ‌ర్ పై మాకే హ‌క్కు ఉందని.. ఈవిష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదని.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ వైఖ‌రిని చెరిగేశారు. ``మా ద‌గ్గ‌ర ఉత్ప‌త్తి అవుతున్న రెమ్‌డిసివ‌ర్‌పై మీ పెత్త‌నం ఏంటి?`` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఈటల రాజేందర్ ఆరోపిం చారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. కరోనా వైరస్తో ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా మారిందన్నారు. తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీకి పంపుతున్నారని అన్నారు. బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఆక్సిజన్ పై ఐ ఏ ఎస్ ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ మేమే వాడుకుంటాం అని తెలిపారు. కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా లేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీలో కరోనా పేషెంట్లకు అవసరమైన అందుతోందని తెలిపారు. కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రితో తాము విసిగిపోతున్నామ‌ని.. ఇదే ప‌ద్ధ‌తి, ప‌రిస్థితి కొన‌సాగితే.. మున్ముందు ఏం చేయాలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కూడా ఈట‌ల హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈటెల వ్యాఖ్య‌లు గ‌రంగ‌రంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.