Begin typing your search above and press return to search.

తల్లిదండ్రులు , కాలేజీ యాజమాన్యాల మధ్య చిచ్చు పెడుతున్న 'అమ్మఒడి' !

By:  Tupaki Desk   |   28 Jan 2020 6:22 AM GMT
తల్లిదండ్రులు , కాలేజీ యాజమాన్యాల మధ్య చిచ్చు పెడుతున్న అమ్మఒడి !
X
అమ్మఒడి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలులోకి తీసుకువచ్చిన ఒక పథకం. ఈ అమ్మఒడి ద్వారా ప్రతి పేద పిల్లవాడు కూడా కార్పొరేట్ స్థాయి విద్యని అభ్యసించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతి పేద విద్యార్థి స్కూల్ ఖర్చుల కోసం , నేరుగా తల్లుల అకౌంట్స్ లోనే రూ. 15 వేలని జమచేస్తున్నారు. ఈ పథకం ఈ నెలలోనే అట్టహాసంగా ప్రారంభించారు. చాలావరకు ఇప్పటికే ఆ అమ్మఒడి పథకానికి అర్హులైన వారికీ డబ్బు కూడా వారి ఖాతాలలో జమ అయ్యింది. అలాగే ఒకవేళ అర్హులైన ఎవరికైనా అమ్మఒడి పథకం డబ్బు రాకపోతే , మరోసారి అమ్మఒడి అప్లై చేసుకోవాలని సీఎం జగన్ చూసించారు.

ఇకపోతే , సీఎం జగన్ ప్రతి పేద పేదవాడు తన పిల్లలకి మంచి విద్యని అందించడానికి చాలా కష్టాలన్నీ ఎదుర్కొంటున్నాడు అని భావించి , వారికీ ఆసరాగా నిలవడానికి ఈ అమ్మఒడి పథకాన్ని తీసుకువస్తే ..ఇదే అదునుగా కొన్ని ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు , కాలేజీ యాజమాన్యాలు ఉన్నపళంగా పీజులని తమకి ఇష్టం వచ్చినట్టు పెంచేసి డబ్బులు కట్టాలని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య ప్రకాశం జిల్లా ..గిద్దలూరు నియోజకవర్గం లో ఎక్కువ గా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాధారణంగా ప్రైవేటు కాలేజీలలో ఇంటర్ ఫీజు ఏడాదికి సగటున రూ.ఐదువేల చొప్పున వసూలు చేసేవారు. కానీ , ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అమ్మఒడి తీసుకు రావడం తో ఒక్కసారిగా ఫీజులని రెట్టింపు చేసినట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు ఒక ఫీజు చెప్పి ..ఇప్పుడు అకస్మాత్తు గా రెట్టింపు ఫీజు కట్టమంటే ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు.

అలాగే గిద్దలూరు నియోజక వర్గంలో చాలా వరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది. సాధారణంగా ప్రైవేట్‌ పాఠశాలల్లోకానీ , ప్రైవేట్‌ కాలేజీలలో కానీ ఫీజుల వద్ద యాజమాన్యం కొంచెం కఠినంగానే ఉంటుంది. చెప్పిన సమయానికి ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్స్ లోకి కూడా అనుమతించరు. అమ్మఒడి డబ్బు సరిగ్గా సంక్రాంతి కి ముందు అకౌంట్ లో జమ కావడంతో పండుగ ఖర్చులకి చాలామంది పేదవారు ఆ డబ్బుని వాడుకున్నారు. కొద్ది రోజులు సమయం ఇస్తే ఫీజు మొత్తం చెల్లిస్తాం అని చెప్తున్నా కూడా ఇన్నాళ్లూ ఫీజులు చెల్లించమంటే అమ్మఒడి వచ్చాక ఇస్తామన్నారని, ఇప్పుడు వెంటనే చెల్లించాలని యాజమాన్యాలు ఖరా ఖండి గా చెబుతున్నాయి. అలాగే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి వర్తిస్తుండటం తో అందరికి ఒకే సారి ఫీజు కట్టలేక మరి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యం లో ఫీజు విషయమై కొన్నిచోట్ల తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు మధ్య తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.