Begin typing your search above and press return to search.
రూపాయి కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
By: Tupaki Desk | 31 Oct 2019 8:31 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఏపీని అభువృద్ధి లోకి తీసుకురావడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాగే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ..ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నిరవేరుస్తున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన నవరత్నాలలో ప్రతి పథకం అమలైయ్యేలా చూడాలని మంత్రులకి - సంబంధిత అధికారులకి ఆర్డర్స్ పాస్ చేసారు. ఒకవైపు రాజకీయంగా ఇతర పార్టీ నేతలు చేసే విమర్శలని తిప్పి కొడుతూ ..మరోవైపు ప్రజల కోసం ఆలోచించే ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇక తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కేసుల్లో అభ్యంతరం లేని భూములను పేదల పేరిటే రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు అడుగుల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 100 నుంచి 300 చదరపు అడుగుల వరకు ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకుంటే జిల్లా కలెక్టర్ నిర్ణయించే ధరల ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు.
అలాగే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి 300 చదరపు అడుగుల వరకు మార్కెట్ విలువ ఆధారంగా కలెక్టర్ ఇచ్చే సిఫారసు మేరకు రెగ్యులరైజ్ చేస్తారు. గతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలు వాటిని మరో పేదకు విక్రయిస్తే దాన్ని కూడా నిబంధనల మేరకు రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే వైసీపీ ప్రభుత్వం అమలుచేయబోతున్న అమ్మఒడి పథకం పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి ఈ పథకాన్ని తీసుకురానున్నారు. అలాగే, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది అని - అలాగే ఈ పథకం కింద లబ్ధి పొందేవారికి తెల్ల రేషన్ కార్డు - ఆధార్ తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. పేదరికంలో ఉండి తెల్లరేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి - అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు అని మంత్రులు తెలిపారు.