Begin typing your search above and press return to search.
అమరావతి వివాదం: అడ్డంగా బుక్కయిన బీజేపీ
By: Tupaki Desk | 27 Feb 2020 10:03 AM GMTఏపీ రాజధాని అమరావతి ఇష్యూలో బీజేపీ ఇప్పటిదాకా గోడమీది పిల్లిలా వ్యవహరిస్తోందన్న అపవాదు ఉంది.. ఇప్పటిదాకా బీజేపీ నాయకులు రెండు నాల్కల ధోరణిని అవలంభించారు. రాజధాని తరలింపు నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారమని కేంద్రం చెబుతుండగా ఏపీ నేతలు మాత్రం రాజధాని తరలింపునకు అడ్డుపడుతున్నారు. అయితే ఇప్పటివరకు రాజధాని విషయంలో ద్వంద వైఖరి అవలంబించి బీజేపీ తప్పించుకొని తిరుగుతోంది. అమరావతి విషయంలో హైకోర్టు జోక్యం చేసుకొని కేంద్రం ఆఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. దీంతో కేంద్రం రాజధాని విషయంలో తన వైఖరి స్పష్టం చేయడం ఖాయంగా కన్పిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ అభివృద్ధికి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు ప్రాంతాలను రాజధానులు గా ప్రకటించారు. మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమరావతి రాజధాని తరలింపును టీడీపీ నేతలతో కలిసి బీజేపీ వ్యతిరేకిస్తుంది. టీడీపీ అమరావతి రాజధాని తరలింపును పూర్తిగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ మాత్రం ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది. కేంద్రం రాజధాని విషయంలో పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతుండగా స్థానిక బీజేపీ నేతలు మాత్రం వ్యతిరేకించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర విభజన సమయంలో కర్నూలులో హైకోర్టు పెడుతామని హామీ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇన్ని రోజులు కేంద్రం పేరు చెబుతూ స్థానిక నేతలు తప్పించుకునే తిరిగారు. రాజధాని తరలింపు విషయంపై కొందరు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. దీంతో కేంద్రం మొదటి నుంచి చెబుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయానికి అధికారం ఉంటుందని చెబుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇదేగనుక జరిగితే స్థానిక బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడక తప్పదు. అయితే కేంద్రం రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని స్థానిక బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.