Begin typing your search above and press return to search.
చంద్రబాబు పై ఫిర్యాదు చేసిన అమరావతి రైతు!
By: Tupaki Desk | 8 Feb 2022 3:30 PM GMTమాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అమరావతి రైతు ఒకరు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన వైనం బయటకు వచ్చింది. ఉండవల్లికి చెందిన సదరు రైతు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు బాబును ఇబ్బంది పెట్టేలా మారాయి. చంద్రబాబు నివాసం కోసం వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించారని.. ఆ రోడ్డు నిర్మాణానికి తమ భూముల్ని వాడేశారని సదరు రైతు వాపోతున్నారు.
ఈ మేరకు తాడేపల్లి తహసీల్దార్ కు రైతు సింగంశెట్టి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు.. లింగమనేని ఎస్టేట్ లో నివాసం ఉండటం తెలిసిందే. చంద్రబాబు నివాసానికి దారి లేదని రైతు చెబుతున్నారు.
రైతుకు చెందిన భూమిలో చంద్రబాబు ఇంటికి వెళ్లటానికి వీలుగా బీటీ రోడ్డు వేశారని.. దానికి సంబంధించి చెల్లించాల్సిన డబ్బుల్నిచెల్లించలేదన్నారు. తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10లక్షల వరకు ఖర్చు పెట్టినట్లుగా రైతు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిలో వైద్యానికి డబ్బుల్లేక.. తన తండ్రిని ఇంటికి తీసుకొచ్చేసినట్లుగా చెబుతున్నారు. తన తండ్రి వైద్యానికి మరో రూ.5లక్షలు అవసరం అవుతుందని.. తమ స్థలం కాని ఉండి ఉంటే.. దాన్ని అమ్ముకొని వైద్యం చేయించి ఉండేవాళ్లమని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. తన స్థలానికి కమిషన్ ఇస్తే.. డబ్బులు ఇప్పిస్తామని టీడీపీ నేతలు తనను వేధిస్తున్నట్లుగా శ్రీనివాసరావు వాపోతున్నాడు. తన స్థలాన్ని తనకు ఇప్పించాలని లేనిపక్షంలో డబ్బులైనా ఇప్పించాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే చంద్రబాబు ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నారు.