Begin typing your search above and press return to search.
అమరావతి.. మహాపాదయాత్ర.. మీడియా వదిలేసిందా?
By: Tupaki Desk | 27 Oct 2021 3:22 PM GMTఅమరావతి- ఏపీ ప్రజలకు ప్రాణప్రదం వంటి రాజధాని నగరం. ప్రపంచ స్థాయి నగరంగా దీనిని తీర్చిదిద్ది.. ఏపీని సమున్నతస్థాయిలో నిలబెట్టేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం అనేక వ్యవప్రయాసలకు ఓర్చి దిద్దాలని భావించిన అద్భుత నగరం. ఇది కేవలం రాజధానిగానే కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు మోసుకువచ్చే అద్భుత నగరిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రాంతం. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానుల పేరుతో దీనిని పక్కన పెట్టింది. ఇక్కడ భూ కుంభకోణం జరిగిందని.. ఒక వర్గం ప్రజలకే న్యాయం చేస్తున్నారని.. ముందస్తు వ్యాపారాలు జరిగాయని.. ఎస్సీ రైతులను మోసం చేశారని పేర్కొంటూ.. పూర్తిగా దీనిని పక్కన పెట్టేసింది.
దీంతో ఇక్కడి రైతులు ఉద్యమ బాటపట్టారు. దాదాపు 676 రోజులుగా వారు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని సాగించారు. సాగిస్తున్నారు.ఇప్పుడు.. ఈ ఉద్యమంలో భాగంగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర తలపెట్టారు. అయితే.. ఆదిలో ఈ అమరావతి ఉద్యమానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన మీడియా.. ఇప్పుడు పాదయాత్ర విషయానికి వచ్చే సరికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సర్వత్రా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు.. ఉద్యమం నుంచి దళిత జేఏసీ నాయకులు తప్పుకొన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి దీనికి రీజనేంటి? అసలు ఏం జరుగుతోంది? అనేది ఆసక్తిగా మారింది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు, కూలీలు సిద్ధమవుతున్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్న ట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు వివరించారు. యాత్రంలో భాగంగా.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను గ్రామగ్రామాన ప్రజల వద్ద ఎండగడతామని మహిళా రైతు లు చెబుతున్నారు.
పాదయాత్రలో అన్ని వర్గాలనూ కలుపుకొని వెళతామని, ఇప్పటికే అన్ని పార్టీల నేతల ను కలిసి ఆహ్వాన పత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. 13 జిల్లాలకు అమరావతితో కలిగే ప్రయోజనాలు వివరించటమే తమ లక్ష్యమంటున్నారు. 45 రోజుల మహాపాదయాత్రలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు, జనసేన, సీపీఐ, సీపీఎం తమ మద్దతును తెలిపాయి. కొన్ని కారణాలతో ఉద్యమానికి దూరంగా ఉన్న దళిత జేఏసీ నేత లు కూడా.. మహాపాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు.
అయితే.. ప్రధాన మీడియా దీనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అదేసమయంలో పాదయాత్ర కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం కానుండడం మరో విషయం. నవంబరు 1 నుంచి సాగనున్న పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు చిత్తూరులోని తిరుపతి వరకు మాత్రమే పరిమితం కానుంది. మరి మిగిలిన 9 జిల్లాల పరిస్థితి ఏంటి? ఆయా జిల్లాల ప్రజలను ఎవరు ఈ ఉద్యమం దిశగా ముందుకు నడిపిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. మరోవైపు.. అసలు ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీనిపైఊ ఇంకా పరిశీలిస్తున్నామని.. ప్రభుత్వం చెబుతోంది. సో.. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.