Begin typing your search above and press return to search.
జగన్ స్ఫూర్తి...మహారాష్ట్రకూ విస్తరించిందే
By: Tupaki Desk | 3 July 2019 2:09 PM GMTవైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మొన్నటిదాకా ఓ మాజీ సీఎం కుమారుడు - వైసీపీ అధినేత - ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా మాత్రమే. అయితే ఇప్పుడు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి... 37 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవాన్ని చవి చూపించిన నేత. ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి... తనదైన శైలి నయా పాలనకు శ్రీకారం చుట్టిన నేతగా చెప్పుకోవాలి. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఏ పంథాను అయితే అవలవంబించారో - అధికార పగ్గాలు చేతికందిన తర్వాత కూడా ఆయన అదే తీరును కొనసాగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై తనదైన స్ట్రాటజీని కొనసాగిస్తున్న జగన్... ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తామంటున్నా... పదవులకు రాజీనామా చేసి వస్తానంటేనే గేట్లు తీసేదని క్లియర్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఈ దిశగా సాగుతున్న జగన్ నిజంగానే ఎందరో యువ రాజకీయ నేతలకు ఆదర్శమేనని చెప్పాలి. ఈ ఆదర్శం తెలుగు రాష్ట్రాలను దాటి మహారాష్ట్రకు పాకిన వైనం ఇప్పుడు మనకు ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజా ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రాజకీయాల్లో తల పండిన నేతలను ఓడించి లోక్ సభలో కాలుమోపిన ఓ యువ మహిళా ఎంపీ... తనకు ఇన్ స్పిరేషన్ జగనేనని ప్రకటించడం నిజంగానే ఆసక్తే కదా. ఆ యువ ఎంపీ ఎవరన్న విషయానికి వస్తే... కొంత కాలం క్రితం టాలీవుడ్ హీరోయిన్ గా మనలను అలరించిన నవనీత్ కౌర్. మహారాష్ట్రకే చెందిన కౌర... సినీ కెరీర్ ను ముగించిన తర్వాత పొలిటీషియన్ అయిన రవి రాణాను పెళ్లి చేసుకున్నారు. భర్త రాజకీయ ప్రస్థానాన్ని చూసిన తర్వాతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌర్... 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే జగన్ మాదిరే ఓటమితో కుంగిపోకుండా... తనదైన శైలి పట్టుదలతో జగన్ మాదిరే ప్రజల్లోనూ ఉంటూ తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ గెలిచారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆమె తెలుగు నేల రాజకీయాల గురించి - తెలుగు ప్రజల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కౌర్ ఏమన్నారంటే... ‘ఆంద్రా నుంచి నాకు జగన్ మోహన్ రెడ్డి ఇన్ స్పిరేషన్. ఆయనను నిత్యం ఫాలో అవుతుంటాను. ప్రజలతో ఎలా మమేకం అవ్వాలన్న విషయాన్ని జగన్ ను చూసే నేర్చుకున్నాను’ అంటూ జగన్ తనకు ఎలా ఇన్ స్పిరేషన్ అయ్యారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు నేలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కౌర్... తనకు నేమ్ తో పాటు ఫేమ్ ను ఇచ్చింది కూడా తెలుగువారేనని చెప్పుకొచ్చారు. ఆంధ్రా - తెలంగాణ గురించిన సమస్యలు లోక్ సభలో లేవనెత్తితే...వాటిని తన సంపూర్ణ మద్దతును తెలుపుతానని కౌర్ చెప్పారు.