Begin typing your search above and press return to search.
అమరావతి పిటీషన్లపై విచారణ వాయిదా
By: Tupaki Desk | 23 Aug 2021 11:04 AM GMTఅమరావతిపై తొందరగా తేల్చేసి విశాఖ రాజధానికి షిఫ్ట్ కావాలన్నది సీఎం జగన్ చిరకాల వాంఛ. అయితే ఆ విషయంలో ఆయన ఏమాత్రం తొందరపడడం లేదన్నది తాజాగా తేలిపోయింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటీషన్ల విచారణ తాజాగా హైకోర్టులో వాయిదా పడింది. హైకోర్టు నవంబర్ 15కు ఈ పిటీషన్లను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనా దేశంలో విజృంభిస్తోందని..కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని పిటీషనర్లు, వాళ్ల తరుఫున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని.. ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు కూడా వాయిదా నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేయడం విశేషం. ప్రభుత్వం అమరావతి విషయంలో ఏమాత్రం తొందరపడడం లేదని.. విచారణకు మొగ్గు చూపడం లేదని తాజా ఘటనతో తేలిపోయింది.
ఈ క్రమంలోనే దేశంలో, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకొని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. పిటీషనర్లు కేసును సాగదీయడానికి వాయదా కోరడం పెద్ద ఆశ్యర్యమేమీ కాదు.. కానీ ప్రభుత్వం తరుఫున కేసులను త్వరగా తేల్చి విశాఖకు తరలివెళ్లాలని అనుకుంటుంది. కానీ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిజానికి అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ చేపట్టాలని ముందుగా హైకోర్టులో పిటీషన్ వేసింది ప్రభుత్వమే. గత మార్చిలో ఏజీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో హైకోర్టు అంగీకరించింది. సీజే ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం కూడా ఏర్పాటైంది. రోజువారీ విచారణకు రెడీ అయిన వేళ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగస్టుకు ఇది వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు వ్యవహారాలు యథావిధిగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో అమరావతి విచారణ వేగంగా పూర్తి చేసి మూడు రాజధానులు ఏర్పాటుకు పోవాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.