Begin typing your search above and press return to search.
డిగ్గీరాజా రెండో భార్య షాకింగ్ నిర్ణయం
By: Tupaki Desk | 15 July 2016 10:13 AM GMTకాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. రాజ్యసభ టీవీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అమృతా రాయ్ తో ప్రేమలో పడ్డ ఆయన రెండేళ్ల క్రితం ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. ఈ క్రమంలో డిగ్గీరాజాకు సంబంధించిన కీలక విషయంలో అమృత క్లారిటీ ఇచ్చారు.
దిగ్విజయ్ సింగ్ కు మొదటి భార్య ద్వారా కలిగిన జయవర్ధన్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు. డిగ్గీరాజాకు ఆయన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయవేత్తగా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుందని ఏ ఒక్కరూ ఆయనను అడగలేదు. అయినా ఆయనే సదరు విషయాన్ని చెప్పేశారు. తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన కుమారుడు జయవర్ధన్ సింగ్ కే చెందుతుందని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని చెప్పిన డిగ్గీ రాజా తన రెండో భార్య అమృతా రాయే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా డిగ్గీ ఈ ప్రకటనలో అమృతను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.