Begin typing your search above and press return to search.

నేను అమ్మ దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు:అమృత ప్రణయ్!

By:  Tupaki Desk   |   9 March 2020 11:20 AM GMT
నేను అమ్మ దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు:అమృత ప్రణయ్!
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు , అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య గురించి, అయన కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియా తో మాట్లాడిన అమృత ... "మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్య కు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్‌ పేరు ఉంటే అనుమానం వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’ అని తెలిపారు.

జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. ఇలా చనిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. ఇవాళ ఉదయం శ్మశానం లో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు అని తెలిపింది. బాబాయ్ , నాన్న మధ్య నున్న ఆస్తి గొడవలు కూడా కారణం కావచ్చు అని తెలిపింది.

భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. నేను అయితే ప్రణయ్‌ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు బలంగా ఉన్నా.. ఇప్పుడు ఎందుకు ఉండలేను అని అన్నారు. అలాగే మారుతీరావు సూసైడ్ నోట్ చూశానన్న అమృత.. అది ఆయన రైటింగే అని తెలిపారు. చనిపోయిన వాళ్లకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే శ్మశానానికి వెళ్లాను, కానీ వాళ్లు అనుమతించలేదన్నారు.