Begin typing your search above and press return to search.
ప్రణయ్ ఆత్మ వాళ్లకు కనిపించిందట!
By: Tupaki Desk | 15 Oct 2018 4:32 AM GMTఆత్మల గురించి కొందరు అదే పనిగా మాట్లాడుతుంటారు. చనిపోయిన వారికి ఒక పద్దతి ప్రకారం ప్రయత్నిస్తే మాట్లాడే అవకాశం ఉందని.. వారితో సంభాషించే వీలుందంటూ కొందరు చెబుతుంటారు. అది నిజామా? కాదా? అన్న దానిపై బోలెడంత చర్చ ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఆత్మల పేరుతో మాయ చేసేటోళ్లు చాలామందే మన చుట్టూ ఉంటారు.
ఆత్మల పేరుతో మాయ చేసే ఇలాంటి వారి మాయలో పడకుండా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వారి మాటలు కొత్త ఆశను కల్పించటమే కాదు.. తమకు ప్రాణ సమానమైన వారిని మరోసారి మాట్లాడే అవకాశం ఉందంటే ఈజీగా ట్రాప్ లో పడిపోతారు.
తాజాగా అమృతను ఇదే తరహాలో మోసం చేసే ప్రయత్నం చేశారో దంపతులు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వుకు చెందిన పొత్తూరు నాగారావు.. సత్యప్రియ దంపతులు ఇటీవల హత్యకు గురైన ప్రణయ్ ఆత్మను తాము చూశామంటూ అమృతను కలిశారు. తాజాగా మిర్యాలగూడ వెళ్లిన ఆ దంపతులు అమృతను కలిశారు. అమృతతో మాట్లాడాలంటూ తమ వద్దకు పిలిపించుకున్నారు.
ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని.. ప్రణయ్ ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతోందని.. ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామని.. నీ కోసం అతడి ఆత్మ ఘోషిస్తూనే ఉంది. మారుతీరావు.. ప్రణయ్ లు గత జన్మలో శత్రువులు.. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకే ప్రణయ్ ను మారుతి రావు హత్య చేయించాడే తప్ప నిజమైన పగ లేదు.. లాంటి వాటలు చెప్పారు.
అంతేకాదు.. ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని.. ఒకవేళ అలా చేస్తే ప్రణయ్ ఆత్మ.. ఆ విగ్రహంలో ఉండిపోతుందన్న మాటను చెప్పారు. ఈ దంపతుల అనుమానాస్పద తీరుపై అమృత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. అమృత ఇంటికి వచ్చిన పోలీసులు.. ఆ దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారిస్తున్నారు. మొత్తానికి ఆత్మల పేరు చెప్పి మాయ మాటల్ని చెప్పే ప్రయత్నం చేసిన దంపతుల ట్రాప్ లో పడకుండా.. అమృత తెలివిగా వ్యవహరించిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.