Begin typing your search above and press return to search.

మోడీ గారు మిల్క్ తాగుతారా.. పెరుగు తింటే అప్పుడు తెలుస్తాయి ఈ రేట్లు!

By:  Tupaki Desk   |   5 Aug 2022 11:30 AM GMT
మోడీ గారు మిల్క్ తాగుతారా.. పెరుగు తింటే అప్పుడు తెలుస్తాయి ఈ రేట్లు!
X
ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ పై జీఎస్టీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పెరుగు, లస్సీపై కూడా 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపింది. దీంతో పెంచిన జేఎస్టీ రేటు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటును 5 శాతం పెంచితే.. కంపెనీలు కూడా ప్యాకెట్ ధరలను పెంచాయి. దీంతో ఇప్పుడు పెరుగు ధర 50 శాతం పెరిగింది. దీని వల్ల సామాన్యులపై భారీ ప్ర‌భావమే ప‌డుతోంది. చాలామంది ఇప్ప‌టికే ప్యాకెట్ పాలు, పెరుగును వ‌దిలించుకుని గేదెల ఫామ్స్ వ‌ద్ద‌కు వెళ్లి పాలు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. చాలా చోట్ల ఇళ్ల వెంట తిరుగుతూ పాలు పోసే వారి కోసం ఆరాలు తీస్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూలై నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్యాక్ చేసిన ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పెరుగు, పనీర్, లస్సీ, తేనె, పొడి సోయాబీన్, గోధుమ వంటి ప్యాక్ చేయబడిన లేదా లేబుల్ చేయబడిన ఉత్పత్తులపై ఈ పన్ను వర్తిస్తుంది. ఫలితంగా జీఎస్టీ భారాన్ని మోయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వీటితోపాటు ధరలు కూడా పెంచేశాయి కంపెనీలు.

బ్రిటానియా 80 గ్రాముల నుండి 400 గ్రాముల వరకు పెరుగు ప్యాకెట్లను విక్రయిస్తోంది. ఇప్పటి వరకు 80 గ్రాముల ప్యాకెట్ ధర రూ. 10 ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్యాకెట్ రేటు రూ. 15కి చేరింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జీఎస్టీని విధించ‌డంతో వీటి రేట్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. సుధా కంపెనీ గత నెలలో కూడా జీఎస్టీ రేటు పెంపు తర్వాత పెరుగు, లస్సీ, మజ్జిగ ధరలను 20 శాతం పెంచింది. సుధా పెరుగు, లస్సీ ధర ఇప్పటి వరకు రూ.10 ఉంటే, ఇప్పుడు రూ. 12కి చేరుకుంద‌ని తెలుస్తోంది.

జీఎస్టీ కౌన్సిల్ జూలై 18 నుంచి ఈ ఉత్పత్తుల ధరలను పెంచడంతో కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ప్రారంభించాయి. ఢిల్లీ-యూపీలో 200 గ్రాముల పెరుగు ధర రూ.17కి పెరిగింది. గతంలో ఈ ధర రూ.16. అలాగే 400 గ్రాముల పెరుగుకు రూ.30కి బదులు రూ.32 చెల్లించాలి. అదేవిధంగా కిలో పెరుగు ధర రూ.65 నుంచి రూ.69కి పెరిగింది. దీంతో పాటు పాలపొడి చిన్న ప్యాకెట్ ధర కూడా రూ.10 నుంచి రూ.11కి పెరిగింది. అమూల్ ఫ్లేవర్ పాల సీసాకు రూ.20కి బదులు రూ.22 వెచ్చించాల్సి వస్తోంది.

ముంబైలోనూ అమూల్ ధరలు పెరిగాయి. ముంబైలో 200 గ్రాముల కప్పు పెరుగు ధర రూ.21. గతంలో ఈ ధర రూ.20 ఉండేది. అలాగే 400 గ్రాముల కప్పు పెరుగు ధర ఇక నుంచి రూ.42 అవుతుంది. ఈ రోజుల్లో ఈ కప్పు ధర రూ.40 మాత్రమే. అలాగే 400 గ్రాముల పెరుగు ప్యాకెట్ ధర రూ.32కి పెరిగింది. ఈ ప్యాకెట్ ధర కూడా రూ.2 పెరిగింది. కిలో పెరుగు ప్యాకెట్ ఇప్పుడు రూ.65కి బదులుగా రూ.69కి అందుబాటులోకి రానుంది.

ముంబైలో 500 గ్రాముల మజ్జిగ ధర రూ.15 నుంచి రూ.16కి పెరిగింది. 170 ఎంఎల్ లస్సీ ధర కూడా రూ. అయితే 200 గ్రాముల లస్సీ రూ.15కే లభిస్తుందని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధి తెలిపారు. అయితే చిన్న ప్యాకెట్లపై పెరిగిన ధరలను తామే భరిస్తామని చెప్పారు.

అమూల్‌తో పాటు ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచబోతున్నట్లు సమాచారం. అమూల్‌తో పాటు ఆనంద, పరాగ్, కైలాష్, మదర్ డైరీ, గోపాల్, మధు సూధన్ వంటి కంపెనీలు పెరుగు, చీజ్, పాలు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన పెరుగు, మజ్జిగ, లస్సీ ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటకలోని మైసూరు జిల్లా కోఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ సొసైటీ యూనియన్ నందిని బ్రాండ్ పెరుగు ధరలను పెంచింది. 200 గ్రాముల ప్యాకెట్ ధర రూ.12కి పెరిగింది. అలాగే 500 గ్రాముల ప్యాకెట్ రూ.24కే లభిస్తోంది.