Begin typing your search above and press return to search.
తెలంగాణలో ‘అమూల్’ ఏం చేయనుంది?
By: Tupaki Desk | 30 Dec 2021 4:16 AM GMTతెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ వచ్చింది. ప్రసిద్ధ పాడి ఉత్పత్తుల సంస్థ అమూల్ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. గత ఏడాది ఏపీలో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. తెలంగాణలో అమూల్ ఏర్పాటు చేసే భారీ డెయిరీ ప్లాంట్ ప్రత్యేకత ఏమంటే.. సౌతిండియాలోనే తొలిసారి తన డెయిరీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. రోజుకు 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల సామర్థ్యంతో స్థాపించి.. ఫ్యూచర్ లో దీన్ని 10 లక్షల లీటర్లకు పెంచనున్నారు.
ఈ ప్లాంట్ నిర్మాణాన్ని 18 - 24 నెలల్లో పూర్తి చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా మరో 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేసే ప్లాంట్ కు అనుబంధంగా బ్రెడ్.. బిస్కెట్.. స్నాక్స్.. సంప్రదాయ స్వీట్లను తయారు చేసే డివిజన్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సంస్థకు అవసరమైన పాలను తెలంగాణ రైతులు.. సమాఖ్యలు.. సహకార సంగాల నుంచి సేకరించనున్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి అమూల్ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకోవటం గమనార్హం. ఈ ప్లాంట్ లో మజ్జిగ.. పెరుగు.. లస్సీ.. కోవా.. మిఠాయిల్ని ఉత్పత్తి చేస్తారు. గత ఏడాది డిసెంబరులో ఏపీలోకి అడుగు పెట్టిన అమూల్.. మళ్లీ డిసెంబరు నాటికి తెలంగాణలో తన ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఏపీలో భారీ ఎత్తున పాలసేకరణను చేపట్టటంపై ఫోకస్ పెట్టిన అమూల్.. తెలంగాణలో మాత్రం ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది.
ఏపీలో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు.. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఉంటాయి. తొలిదశలో చిత్తూరు.. కడప.. ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభించారు. కానీ.. అమూల్ ఆశించినంతగా పరిస్థితులు లేకపోవటంతో.. ఈ యూనిట్లలో కొన్నింటికి మూసేసింది. మిగిలిన కంపెనీలతో పోలిస్తే.. అమూల్ ఇచ్చే పాల ధర తక్కువగా ఉండటంతో వారికి పాలు పోయటానికి రైతులు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. మొత్తంగా ఏడాదిలోనే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన అమూల్.. ఏపీ ప్రభుత్వం వైపు వేలెత్తేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. సోషల్ మీడియాలో ఏపీ సర్కారుపై పంచ్ లు పేలుతున్నాయి.