Begin typing your search above and press return to search.
18 ఏళ్ల నూనుగు మీసాల యువకుడే సిద్దూ హంతకుడు..
By: Tupaki Desk | 4 July 2022 4:25 PM GMTఢిల్లీలోని బస్ టెర్మినల్ లో అంకిత్ సిర్సా (18) అనే యువకుడిని పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. అతను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు. సింగర్ మూస్ వాలాపై ఈ అంకిత్ ఏకంగా ఆరుసార్లు కాల్చాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అంకిత్ సిర్సా షూటర్లలోనే అతి పిన్న వయస్కుడు. అయితే సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రధాన షూటర్ ఇతడేనని తెలిసింది. అంకిత్ సిర్సా సిద్ధూ మూస్ వాలా ఏకంగా ఆరు రౌండ్లు కాల్చాడు. అంకిత్ సిర్సా గాయకుడు సిద్దూమూసా వాలా దగ్గరికి వెళ్లి రెండు చేతులతో కాల్చాడు. అంకిత్ 'మూస్ వాలా' దగ్గర స్పెల్లింగ్ కాట్రిడ్జ్‌లతో తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోలు ఉన్నాయి.
అంకిత్ సిర్సా తన చిత్రాలలో ఏకే-47తోపాటు అనేక ఇతర తుపాకులతో పోజులిచ్చాడు. సిద్ధూ మూస్ వాలాను మే 29న దుండగుల బృందం కాల్చి చంపారు. అతని శరీరంలో 19 బుల్లెట్ గాయాలు ఉన్నాయి.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మే 29న కొందరు ఆగంతకులు కాల్పులు జరపడంతో ఈ పాపులర్ సింగర్ మృతిచెందాడు. అయితే పంజాబ్ పోలీసులు సెక్యూరిటీని ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం విషాదం నింపింది.
గాయకుడికి పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ ఉపసంహరించకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రీ సలీంఖాన్ కు తాజాగా బెదిరింపు లేఖ రావడం సంచలనమైంది.

#WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd
— ANI (@ANI) July 4, 2022