Begin typing your search above and press return to search.

ట్రంప్, ఎలన్ మస్క్ ల మధ్య ముదిరిన వివాదం

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
ట్రంప్, ఎలన్ మస్క్ ల మధ్య ముదిరిన వివాదం
X
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో పెట్టుకుంటే అంత ఈజీగా వదలరన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయనతో ఫైటింగ్ కు దిగితే ఎదుటివారి తాట తీస్తారు. మాటల యుద్ధం చేస్తారు. అయితే ప్రత్యర్థి కూడా అంతే బలవంతుడు.. మొండివాడు అయితే మాత్రం టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ తో ఫైట్ కు దిగాడు ట్రంప్.

తాజాగా మొన్నటివరకూ అన్యోన్యతను చాటుకున్న డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ లు ఇప్పుడు వాదులాడుకుంటున్నారు. ఎలన్ మస్క్ ను టార్గెట్ చేసి ట్రంప్ విమర్శలు చేయడం.. దానికి అంతే ధీటుగా మస్క్ బదులివ్వడంతో ఈ లొల్లి పతాకస్తాయికి చేరింది.

ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి ఎలాన్ మస్క్ తప్పకోవడంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ట్విటర్ ను మస్క్ కొనుగోలు చేయడని తాను ముందే చెప్పానని’ ట్రంప్ విమర్శించారు. అతడికి అంత సీన్ లేదని తనకు తెలుసుని అన్నాడు. ట్రంప్ రిపబ్లికన్లకే ఓటు వేశాడని లీక్ చేశాడు.

దీనికి హర్ట్ అయిన ఎలన్ మస్క్ ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ వయసు పెరిగిపోయిందని.. ఇకనైనా క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి తన శేష జీవితాన్ని హాయిగా గడపాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దీనికి ట్రంప్ మరింత రెచ్చిపోయాడు. ‘తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మస్క్ వైట్ హౌస్ కు వచ్చి సబ్సిడీలతో నడుస్తున్న తన చాలా ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరాడని.. అప్పుడు నేను అతడిని మోకాళ్లపై కూర్చొని అడుక్కోమని చెప్పినా అతడు చేసేవాడని సీక్రెట్ విషయాన్ని బయటపెట్టాడు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో కూడా జిఫ్ ఇమేజ్ ను కౌంటర్ గా మస్క్ పెట్టి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. తాను ఎప్పుడు ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లకు ఓటు వేయలేదని ఆడిపోసుకున్నారు.